BigTV English

Costumes Krishna: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

Costumes Krishna: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

Costumes Krishna: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరో నటుడు కన్నుమూశారు. సీనియర్ నటుడు , నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి చెందారు. కొంతకాలంగా కృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.


సినీప్రముఖలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో కృష్ణ జన్మించారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, జయసుధ, జయప్రద వంటి సీనియర్ నటీనటులకు కాస్ట్యూమ్స్ అందించారు. అతి తక్కవ సమయంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.


ఇక డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన భారత్ బంద్ సినిమాతో కృష్ణ నటుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, పుట్టింటికి రా చెల్లితో పాటు పలు సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, తండ్రిగా, తాతగా పలు పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×