Big Stories

CPS రద్దు.. పాత పింఛనుకు గ్రీన్ సిగ్నల్.. ఉద్యోగులకు బిగ్ న్యూస్

CPS : అవును, సీపీఎస్ రద్దుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎస్ ను రద్దు చేసి.. ఆ స్థానంలో పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని తీర్మానించింది. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు నిజమైన పండగ వచ్చినట్టైంది. సీపీఎస్ రద్దు చేయబోతున్నట్టు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్వయంగా ప్రకటించారు.

- Advertisement -

చెప్పినట్టే చేసింది పంజాబ్ ఆప్ సర్కార్. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే.. సీపీఎస్ రద్దుకు కేబినెట్ ఓకే చెప్పడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం అవుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆప్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే, పంజాబ్ రాష్ట్ర నిర్ణయం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ఒత్తిడిని తీసుకురావడం ఖాయం.

- Advertisement -

ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని చాలాకాలంగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణలోని ఉద్యోగ సంఘాలు ఉదాసీనంగా ఉంటుండటంపై విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ కనుసన్నల్లోనే తెలంగాణ ఉద్యోగ సంఘాలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో మాత్రం తెలంగాణ మాదిరి కాదు. అక్కడ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. పీఆర్సీ విషయంలో మిలియన్ మార్చ్ తో సత్తా చాటారు. జగన్ కాస్త తగ్గినట్టు కనిపించినా.. చివరాఖరికి ప్రభుత్వానిదే అప్పర్ హ్యాండ్ అయింది.

అటు, సీపీఎస్ రద్దు కోసమూ ఏపీ ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయితే, వైసీపీ సర్కారు మాత్రం సీపీఎస్ రద్దు చేయడం కుదరదంటే కుదరదని తేల్చి చెబుతోంది. మరి, జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారుగా అని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఆయనకు సీపీఎస్ పై సరైన అవగాహన లేనందునే రద్దు హామీ ఇచ్చారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ రాష్ట్ర కేబినెట్ సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రెజర్ పెంచడం ఖాయం అంటున్నారు. పంజాబ్ స్పూర్తితో ఇక్కడి ఉద్యోగులు మరింత గట్టిగా పోరాడే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News