BigTV English

No Traffic Challan : నో ట్రాఫిక్ చలాన్స్.. దీపావళికి బంపర్ ఆఫర్…

No Traffic Challan : నో ట్రాఫిక్ చలాన్స్.. దీపావళికి బంపర్ ఆఫర్…


No Traffic Challan : ఇక మీ ఇష్టం. దీపావళి పండక్కి వాహనదారులు పండగ చేసుకోవచ్చు. వారం రోజుల పాటు నో ట్రాఫిక్ చలాన్స్. హెల్మెట్ లేకపోయినా.. సిగ్నల్ జంప్ చేసినా.. రాంగ్ రూట్ లో వెళ్లినా.. త్రిబుల్ రైడింగ్ చేసినా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా.. ట్రాఫిక్ పోలీసులు ఏమీ అనరు. ఎలాంటి ఫైన్లు విధించరు. బండి సీజ్ చేయరు. దీపావళి సందర్భంగా ఇలా బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మాత్రమే ఈ ఆఫర్.

గుజరాత్ హోంమంత్రి హర్ష సాంఘవి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సర్కారు నిర్ణయంతో ఆ రాష్ట్ర వాహనదారులు పండగ చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ తీరును విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు.. వాహనదారుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. ఇలాంటి ప్రమాదకర నిర్ణయాలను తీసుకుంటున్నారంటూ తప్పుబడుతున్నారు.


తీవ్ర విమర్శలు వస్తుండటంతో కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది గుజరాత్ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలు పాటించ వద్దని తాము చెప్పడం లేదని.. ఎవరైనా పొరబాటున రూల్స్ ఉల్లంఘిస్తే.. పండగ వారం రోజుల పాటు ఎలాంటి జరిమానాలు విధించబోమని అంటున్నారు. చలాన్లు వేయకున్నా.. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా పోలీసులు సూచనలు చేస్తారన్నారు గుజరాత్ హోంమంత్రి.

ఈ ఆఫరేదో భలే ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి స్కీం పెడితే బాగుండంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.

Tags

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×