E-Paper
Advertisement

సదాశివపేటలో ఏసీబీ మెరుపు దాడి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు

సదాశివపేటలో ఏసీబీ మెరుపు దాడి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్ అధికారులు
Advertisement

Sadashivpet ACB Raid: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ ఆఫీస్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చగా మారింది. అక్కడ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా రాజేశ్ కుమార్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా శివరెడ్డి పని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, 2025లో వినాయక నిమజ్జనం తర్వాత టౌన్‌లోని ఉబా చెరువులో పూడికతీత పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూ. 4.50 లక్షల బిల్లు మంజూరైంది. ఆ బిల్లు క్లియర్ చేసి ఇవ్వడానికి రాజేశ్ కుమార్ రూ. 15 వేలు లంచం అడిగాడు. శుక్రవారం ఆ డబ్బును కాంట్రాక్టర్ దగ్గర తీసుకుని దాచిపెట్టాలని శివరెడ్డికి చెప్పాడు.

అరెస్ట్ – రిమాండ్

Advertisement

కాంట్రాక్టర్ నుంచి ముందే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అక్కడ మాటువేశారు. డబ్బు చేతులు మారగానే వెంటనే దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న రూ. 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి రాజేశ్ కుమార్, శివరెడ్డిలను అరెస్ట్ చేశారు. తర్వాత ఇద్దరినీ నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.

Also Read: ఇన్నాళ్లూ సైలెంట్.. ఇక సిట్ సైరన్ మోగించనుందా? ఫోన్ ట్యాపింగ్‌లో బిగ్ అప్‌డేట్!

Tags

Related News

ఇన్నాళ్లూ సైలెంట్.. ఇక సిట్ సైరన్ మోగించనుందా? ఫోన్ ట్యాపింగ్‌లో బిగ్ అప్‌డేట్!

‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!

ఒక్క స్కాన్‌తో మీ భూమి మ్యాప్ అంతా మీ ఫోన్‌లోనే.. కొత్త పాస్‌బుక్‌ల ప్రత్యేకతలు ఇవే!

ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. అనాథలకు ఆస్తి రాసిస్తూ సూసైడ్ నోట్

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

Big Stories

Advertisement
×