Deviyani Sharma:దేవియాని శర్మ..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ లుక్స్ తో ఫాలోవర్స్ ని ఫిదా చేసే ఈ యంగ్ బ్యూటీ ఇపుడు మరోసారి నెట్టింట మంటలు పెట్టేస్తుంది.
మాములుగా హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసినప్పుడు కేవలం స్టైల్, ఫ్యాషన్ గురించి మాత్రమే రాస్తుంటారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.కానీ ఈసారి దేవియాని శర్మ తన బ్యూటిఫుల్ పిక్ తో పాటు లైఫ్ మీనింగ్ చెప్పే క్రేజీ కొటేషన్‌ను యాడ్ చేయడం ఇక్కడ విశేషం.
“హుస్న్ చెహ్రే మే నహీ, ఉస్ నూర్ మే హై జో రూహ్ సే టపక్తా హై” అంటూ ఈ భామ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మరి.నిజమైన అందం ముఖంలో కాదు, మనసులో ఉంటుందని దేవియాని చాలా సింపుల్‌గా చెప్పింది ఈ ముద్దుగుమ్మ .
ఈ రోజుల్లో చాలామంది కేవలం బయటి లుక్స్, బట్టలు, మేకప్ చూసే అందాన్ని అంచనా వేస్తున్నారు. కానీ మనిషి వ్యక్తిత్వం, ఆలోచించే తీరు, అందరితో మర్యాదగా ఉండే గుణమే అసలైన అందం అని ఆమె తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఏమాత్రం హడావుడి లేకుండా, చిన్న చిరునవ్వుతో న్యాచురల్ గా ఉన్న ఆమె ఫోటో ఈ మాటలకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యిందనడంలో సందేహం లేదు.
ఇక దేవియాని శర్మ కెరీర్ విషయానికి వస్తే.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు , తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకెళ్తోందనే చెప్పాలి. 2020లో వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత పూరి జగన్నాథ్ నిర్మాణంలో వచ్చిన ‘రొమాంటిక్’ సినిమాలో మెరిసింది.
అలా సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చూపిస్తూనే, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ వరుస ఛాన్స్ లు పట్టేస్తుంది.ముఖ్యంగా మహి వి. రాఘవ దర్శకత్వంలో వచ్చిన ‘సైతాన్’ వెబ్ సిరీస్ దేవియాని కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పాలి. అందులో జయప్రద అనే బోల్డ్ పాత్రలో ఆమె నటించిన తీరు నెక్స్ట్ లెవెల్ .
ఆ తర్వాత ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది. భార్యాభర్తల మధ్య జరిగే సీన్స్ లో ఆమె ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు ఆడియన్స్ .వీటితో పాటు ‘ఝాన్సీ’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’, ‘అనగనగా’ వంటి వెబ్ సిరీస్‌లలోనూ నటించి తనని తాను పేరోవ్ చేసుకుంది ఈ భామ.
ఇక . గతేడాది ’28 డిగ్రీస్ సెల్సియస్’ చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ, ‘ద్రౌపది 2’ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టడం విశేషం.మొత్తానికి ఒకవైపు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తనదైన పోస్ట్ లతో రచ్చ చేస్తుంది ఈ భామ !
also read:రూ.2500 కోసం ఎంఎస్ నారాయణ పట్టుబట్టారా?.. అసలు విషయం చెప్పిన తమ్మారెడ్డి!