E-Paper
Advertisement

‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!

‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!
Advertisement

BRS MLAs: శాసన సభ్యుల హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్ సంజయ్ జాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్ కు ఫిర్యాదు చేశామన్నారు.

గతంలో పార్టీలకు అతీతంగా సర్పంచులకు పనులు అప్పగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. 2000 నుంచి ఇంత ప్రోటోకాల్ ఉల్లంఘనలు గతంలో ఎప్పుడూ లేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.

Advertisement

ఓడిపోయినవారు పెత్తనం చెలాయిస్తున్నారు. తాము గెలిచినా మర్యాద ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అసెంబ్లీ కి కూడా రావద్దని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని మండిపడ్డారు. అవసరమైతే ముఖ్యమంత్రి తన పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థినీ అసెంబ్లీకి పిలిపించుకునేలా చట్టం చేస్తారేమోనని ఎద్దేవా మాజీ మంత్రి సబితా ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు పదవులు లేకున్నా సభల్లో వేదికలపై కూర్చుంటున్నారని మండిపడ్డారు. మూడు సంవత్సరాల నుంచి ఓపిక పట్టామని, ఇక సహించేది లేదన్నారు. నియోజకవర్గాల్లో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేదికల పై కనీస మర్యాద ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.

Advertisement

Also Read: రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలకు ఎంట్రీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు!

బీఆర్ఎస్ఎల్పీ విప్ కె .పి వివేకానందగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు రావాలని పాట్లు పడుతున్నారన్నారు. మూడు సంవత్సరాల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు.

Also Read: బతికుండగానే ‘అంత్యక్రియల’కు అడ్వాన్స్ బుకింగ్.. మార్కెట్లోకి కొత్త బిజినెస్.. రూ.6,000 నుంచి ప్యాకేజీ ప్రారంభం!

Tags

Related News

ఒక్క స్కాన్‌తో మీ భూమి మ్యాప్ అంతా మీ ఫోన్‌లోనే.. కొత్త పాస్‌బుక్‌ల ప్రత్యేకతలు ఇవే!

ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. అనాథలకు ఆస్తి రాసిస్తూ సూసైడ్ నోట్

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి!

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×