E-Paper
Advertisement

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ సిటీలో వివిధ చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. చాన్నాళ్లు తర్వాత వర్షం పడడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తోంది. గురువారం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లోనే కాదు రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

Advertisement

మిగతా జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి వర్షాలు కురిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావం తెలంగాణపై పడింది. గడిచిన రెండు రోజులుగా వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా గురువారం అర్ధరాత్రి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ గురించి చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాత 2 గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, కాప్రా, దమ్మాయిగూడ, బాలానగర్ పరిసరాల్లో 50 మి.మీ వరకు వర్షం పడినట్టు ఓ అంచనా. చాలా కాలం తర్వాత కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

శుక్రవారం ఉదయం ఉదయం 6.30 గంటలకు పటాన్‌చెరు, ఆర్.సి. పురం, అమీన్‌పూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్, బాలానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, షేక్‌పేట, మెహిదీపట్నం, లంగర్ హౌస్ వంటి ప్రాంతాల్లో గంట నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. డ్యూటీలకు వెళ్లేవరకు ముందుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. శుక్రవారం వాతావరణ అంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతోంది.

ALSO READ: ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్ ఫైర్!

 

Related News

ఏపీలో జరిగే స్థానిక ఎన్నికల నిర్వహణపై జగన్ ఫైర్!

బైకర్‌ను ఢీకొట్టిన రెండు కార్లు.. గాల్లో పల్టీలు కొట్టి కిందపడ్డాడు.. కట్ చేస్తే ఊహించని సీన్!

శ్రీవారికి 121 కిలోల స్వర్ణ కానుక.. ఆ బంగారంతో ఏమేం చేయించారో తెలుసా?

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికలు రద్దు.. బ్యాలెట్ బాక్స్‌‌లో ఇంకు పోసిన వ్యక్తులు

‘నాకు పేరు వస్తుందనే రాయలసీమ లిఫ్ట్ ఆపేశారా?’.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.. ఆ మహాదాత ఎవరో తెలిసిపోయింది!

చరిత్ర తిరగరాసిన వైసీపీ.. జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×