E-Paper
Advertisement

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?
Advertisement

Miyapur Lands: భాగ్యనగరంలో మియాపూర్ ప్లాట్ల వేలంకు రెడీ అవుతోంది. అందుకోసం హెచ్‌ఎండిఏ పక్కాగా ప్రణాళికలు వేస్తోంది. ఈ భూముల వేలం ద్వారా దాదాపు రూ.30 వేల కోట్ల రాబట్టాలని అంచనా వేస్తోంది. దీనికి సంబందించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ హెచ్ఎండీఏ ప్లాన్ ఏంటి?

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు

హైదరాబాద్ సిటీ భారీ లేఅవుట్‌కు రెడీ చేస్తోంది హెచ్ఎండీఏ. మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయా భూముల్లో లేఅవుట్‌ వేసి ప్లాట్లను విక్రయించేలా వేగంగా అడుగులు వేస్తోంది. 386 ఎకరాల్లో వెంచర్ వేసి ప్లాట్లగా విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా.

జాగ్రత్తగా అడుగులు వేస్తున్న హెచ్ఎండీఏ

Advertisement

అనుకున్నట్లుగా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఆర్థిక ఇబ్బందులు తొలగినట్టే.  హైదరాబాద్‌ సిటీ శేరిలింగంపల్లి మండలం పరిధిలో భూముల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక రెడీ చేసింది. ఆ భూములను భారీగా అభివృద్ధి చేయనుంది. అందుకు సంబంధించిన పనులు జరుగు తున్నాయి. విశాలమైన రహదారులు, మౌళిక వసతులు కల్పించాలని భావిస్తోంది. దీని వల్ల ఆయా భూములు వేలంలో కోట్లు పలుకుతాయని ఆలోచన చేస్తోంది.

గతంలో కోకాపేట నియోపొలిస్‌లో అదే చేసింది, అక్కడ సక్సెస్ అయ్యింది. దాదాపు 500 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్‌ వేసింది. వేలం వేయడంతో ప్రభుత్వానికి దాదాపు రూ.9700 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఎకరం భూమి గరిష్ఠంగా రూ.151 కోట్లు పలికిన విషయం తెల్సిందే. మియాపూర్‌ భూములను ఆ తరహాలో చేయాలని భావించింది హెచ్‌ఎండీఏ. అందుకోసం రూ.600 కోట్లు వెచ్చించనుంది.

Advertisement

ALSO READ: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ముంబై జాతీయ రహదారికి దగ్గరలో ఉండడం, విశాలమైన ప్రాంతం కావడంతో ఆయా భూములకు భారీగా డిమాండ్‌ ఉంటుందని ఆలోచన. ఈ భూములపై రెండున్నర దశాబ్దాలుగా వివాదం నడిచింది. చివరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్చు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఫలితంగా 550 ఎకరాల భూములు ప్రభుత్వానికి చేతికి వచ్చాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బలంగా ఉంది.

వేలంలో ఆ భూములను కొనుగోలు చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడనున్నాయి. అనుకున్నట్లు జరిగితే ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని ఓ అంచనా. అభివృద్ది చేసిన భూములను దశల వారీగా వేలం వేస్తారా? ఒకేసారి వేలం వేస్తారా? జరుగుతున్న పరిణామాలను విపక్షాలు గమనిస్తున్నాయి.

Related News

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి!

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!

ఆ రెండు బిల్లులతో.. బీజేపీ వేస్తున్న బిగ్ స్కెచ్ ఇదే..?

ఈ రెండు రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ: మంత్రి ఉత్తం!

Big Stories

Advertisement
×