Software Employee: మనసులో బాధను చెప్పుకోవడానికి తోడు లేకపోతే ఆ ఒంటరితనం చాలా నరకం. ఆ సమయంలో దారుణమైన నిర్ణయానికైనా దారితీస్తాం. అలాంటిదే హైదరాబాద్‌లో జరిగిన ఒక విషాద ఘటన మరోసారి గుర్తుచేసింది.
అసలేం జరిగింది?
జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన 36 ఏళ్ల బక్కశెట్టి సింధూజ (తుషారిక) హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. 2015లో పెళ్లయినా, ఏడాదిన్నరకే విడాకులు కావడంతో మియాపూర్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే ఉంటోంది.
వెలుగులోకి వచ్చిన విషాదం
గురువారం ఉదయం సహోద్యోగి రాజీరెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సింధూజ స్పందించలేదు. అనుమానంతో ఆమె ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
అక్కడ దొరికిన సూసైడ్ నోట్ అందరినీ కదిలించింది. గత నాలుగు నెలలుగా ఒంటరితనం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె రాసింది. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, తన బ్యాంకు ఖాతాలోని డబ్బును అనాథ పిల్లలకు ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా, కోర్టులో ఉన్న తన ఆస్తి కేసులను కొనసాగించి, ఆ ఆస్తి మొత్తాన్ని ‘కుర్ ట్రస్ట్’ కు అందజేయాలని చివరి కోరికగా రాసింది.
Also Read: తన కూతురికి ఇండియా అని పేరు పెట్టిన విదేశీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?