E-Paper
Advertisement

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ
Advertisement

AICC Notice: కామారెడ్డి కాంగ్రెస్ నేతల మధ్య భగ్గుమన్న వివాదం.. ఏఐసీసీ వరకూ చేరింది. మహిళలతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. షబ్బీర్ అలీ మాట్లాడిన వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పబ్లిక్‌లో చర్చకు తీసుకురావడంపై కూడా అసంతృప్తి చెందారు. ఈ మేరకు షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసులు పంపారు. తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

కామారెడ్డి కాంగ్రెస్ నేతలైన షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రటరి చంద్రశేఖర్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా వివాదం సాగుతోంది. వీరిద్దరు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం చంద్రశేఖర్ రెడ్డి భార్య, కాంగ్రెస్ మహిళా నాయకురాలు గడ్డం ఇందుప్రియ.. కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి షబ్బీర్ అలీపై స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బహిరంగంగా ఆయనకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

పార్టీ అధిష్ఠానాన్ని, తోటి నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని షబ్బీర్ అలీని ఇందుప్రియ హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని షబ్బీర్ అలీ అన్న కొడుకు తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాననే తన మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే షబ్బీర్ అలీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అని మండిపడ్డారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

Advertisement

అంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై షబ్బీర్ అలీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కామారెడ్డిలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ గెలవకపోవడానికి షబ్బీర్ అలీనే కారణమని ఆయన అన్నారు. ఆయన తీరుతో కామారెడ్డిలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందని అన్నారు. ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించాలని కోరారు. చంద్రశేఖర్ రెడ్డి, ఇందుప్రియ వరుస ఫిర్యాదులకు తోడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ అప్రమత్తమైంది. దీనిపై వివరణ కోరుతూ తాజాగా షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై షబ్బీర్ అలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also Read: ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!

Related News

తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

మేడ్చల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై ఈసీఐ సెక్రటరీ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఓటర్లకు బిగ్ అలర్ట్.. తెలంగాణలో ‘SIR’ గడువు పొడిగింపు.. ఎన్ని రోజులంటే?

మీ ఓటు ఉందో లేదో డౌటా? ఒక్క మెసేజ్‌తో ఇలా చెక్ చేసుకోండి!

హైడ్రా కమిషనర్‌ను వెంటనే మార్చండి- హైకోర్టు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ కొత్త కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! – సీఎం రేవంత్

Big Stories

Advertisement
×