BigTV English

Telangana BJP news: అమిత్‌షాకు అచ్చిరాని తెలంగాణ!.. ‘షా’ షో రద్దు..

Telangana BJP news: అమిత్‌షాకు అచ్చిరాని తెలంగాణ!.. ‘షా’ షో రద్దు..
Amit shah latest news

Amit shah latest news(Political news today telangana): తెలంగాణపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు అమిత్‌షా. ఎప్పుడెప్పుడు వద్దామా అనే ఆరాటం చూపిస్తున్నారు. అప్పుడప్పుడూ వస్తున్నారు కూడా. ఇప్పటికే ఢిల్లీ నుంచి తెలంగాణ బీజేపీని పాలిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడినీ మార్చేశారు. ఈటలకు కీలక పదవి కట్టబెట్టారు. అంతేనా? ఇంకా చాలానే చేయాల్సి ఉంది తెలంగాణలో.


కర్నాటక పరాజయం తర్వాత ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ చేశారు అమిత్‌షా. వీలుకుదుర్చుకుని మరీ తెలంగాణ బాట పడుతున్నారు. వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రముఖులను కలిసే ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ తర్వాత ఆస్కార్ వచ్చినందుకు అభినందిస్తానంటూ RRR టీమ్‌తోనూ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. కానీ, టైమ్ లేక అది లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయింది. ఖమ్మంలో సభ పెడదామనుకున్నారు. అదీ మిస్ అయింది. ఈలోగా అధ్యక్షునితో సహా పార్టీలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.

అన్ని ఇష్యూస్ సెట్ చేద్దామని.. జులై 29న హైదరాబాద్ టూర్ ప్లాన్ చేశారు షా. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుదామని అనుకున్నారు. కానీ…. ఈసారి కూడా షా షో క్యాన్సిల్ అయింది. వాతావరణం ఆయనకు సహకరించలేదు. అతిభారీ వర్షాల వల్ల అమిత్‌షా తన షెడ్యూల్ రద్దు చేసుకున్నారు. అందుకోగానీ.. అమిత్‌షాకు తెలంగాణ పర్యటనలు అంతగా అచ్చిరావడం లేదంటున్నారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×