E-Paper
Advertisement

Telangana Congress Victory | ఇంతటి విజయం కాంగ్రెస్ ఎలా సాధించింది?

Telangana Congress Victory | ఊహించింది కొంత. ఊహించనిది మరికొంత. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ అనుకున్నారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య ఫైట్ నడిచింది. రూలింగ్ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇంతకీ, కాంగ్రెస్‌ స్వీప్ చేసిన జిల్లాలేంటి? కేసీఆర్ పరువు నిలబెట్టిన జిల్లాలేంటి?

Telangana Congress Victory | ఇంతటి విజయం కాంగ్రెస్ ఎలా సాధించింది?

Telangana Congress Victory | ఊహించింది కొంత. ఊహించనిది మరికొంత. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ అనుకున్నారు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య ఫైట్ నడిచింది. రూలింగ్ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇంతకీ, కాంగ్రెస్‌ స్వీప్ చేసిన జిల్లాలేంటి? కేసీఆర్ పరువు నిలబెట్టిన జిల్లాలేంటి?

అందరూ ఊహించినట్లే.. కొన్ని జిల్లాలు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఒక్క అభ్యర్థి కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్ద శపథమే పట్టారు. బీఆర్ఎస్ నుంచి ఆయన అవమానకర రీతిలో బయటకు రావాల్సి వచ్చింది. దీన్ని పొంగులేటి చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసీఆర్ కు ఓటమి రుచేంటో చూపిస్తానని బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేయించే స్థితికి తీసుకొచ్చారు. కేసీఆర్ కు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడే పెట్టేశారు. నిజానికి గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది కారెక్కేశారు. ఇది కూడా కాంగ్రెస్ ప్రతీకారాన్ని మరింత పెంచింది.

దీంతో పాటు ఖమ్మంలో కాంగ్రెస్‌కు బలమైన నేతలు ఉన్నారు. పార్టీకి క్యాడర్‌ కూడా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరిక కాంగ్రెస్‌కు మరింత బలాన్ని పెంచిందనే చెప్పాలి. ఇప్పటికే భట్టి విక్రమార్క కూడా అక్కడ బలమైన నేతగా ఉన్నారు. వీరందరూ కలసి పనిచేయటం ఒక ఎత్తైతే…సీపీఐ పార్టీ కూడా కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా కూనంనేని సాంబశివరావు మద్దతు తెలపటంతో పాటు చాలా చోట్ల ప్రచారంలోనూ పాల్గొన్నారు. పొత్తుల భాగంగా… భాగస్వామ్య పార్టీకి అండదండగా నిలిచి.. హస్తం గెలుపులో ఆయనా భాగస్వామి అయ్యారు.

కాంగ్రెస్‌కు వెన్నెముకగా నిలిచిన మరో జిల్లా నల్గొండ. కోమటిరెడ్డి బ్రదర్స్‌ సహాకారం .. పార్టీ విజయంలో కీలకంగా నిలిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. హస్తానికి గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరటంతో పార్టీ క్యాడర్‌ కాస్త నిరాశకు గురయ్యింది. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతగా ముందుకురాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టిపిసిసి అందరినీ ఏకం చేయటంలో విజయం సాధించింది.

అందరం కలవాలి… హస్తాన్ని గెలిపించాలనే నినాదంలో చేతులు కలపటం కలిసొచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో మరింత యాక్టివ్‌ కాగా… బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. దీంతో జిల్లాలో క్యాడర్‌కు జీవం వచ్చినట్లు అయ్యింది. దీంతో పాటు సీనియర్‌ నేత జానారెడ్డి సలహాలు ఇవ్వటం కూడా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించింది.

కొన్ని జిల్లాల్లో మాత్రం BRS, BJP.. హవా పూర్తిగా కనిపించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ప్రజలు..కారు వైపే ఆసక్తి చూపారు. అక్కడ మాత్రం కాంగ్రెస్‌కు ఆశించిన స్థానాలు రాలేదు. కొన్ని జిల్లాల్లో కొంతవరకూ విజయం సాధించినా…. మొత్తానికి అధికారం కైవసం చేసుకుంది. మొత్తం మీద మెజార్టీ ప్రజలు కేసీఆర్‌ పాలనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించటంతో పాటు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ విజయం మరింత సునాయాశమైంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×