
Telangana assembly election 2023(Latest political news telangana) :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందే జరుగుతాయా? సెప్టెంబర్ మొదటివారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న ఎక్స్‌క్లూజివ్ సమాచారమిది. తెలంగాణలో ఎన్నికలు ముందుగానే జరుగుతాయని అంటున్నారు.
తెలంగాణలో అక్టోబర్ మొదటి వారంలో కానీ, రెండో వారంలో కానీ ఎన్నికలు జరగొచ్చని ఢిల్లీ వర్గాల టాక్. ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు పెరుగుతోందని సర్వేల్లో స్పష్టమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత బీజేపీలో కూడా జోష్ తగ్గినట్టు తేలుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి త్వరగా ఎన్నికలు జరిగితేనే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అందుకే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రటించారని తెలుస్తోంది.
మరోవైపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15 లోగా రేసు గుర్రాలను ప్రకటిస్తామన్నారు టి.కాంగ్రెస్ వ్యవహారాల ఇ న్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే. ఇలా కాంగ్రెస్ కూడా ఎన్నికలకు అన్నివిధాలా సన్నద్ధమవుతోంది.
2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి ఇంచుమించు అదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తారని తొలుత భావించారు. అక్టోబర్ రెండో వారంలో నోటిఫికషన్ విడుదలవుతుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా అక్టోబర్ లో ఎలక్షన్స్ జరుగుతాయని తాజాగా వార్తలు వార్తలు రావడం ఆసక్తిగా మారింది.