BigTV English

Somesh Kumar : సోమేష్ కుమార్ భూ కొనుగోళ్లలో బిగ్ ట్విస్ట్..ఎకరం రేట్ ఎంతో తెలుసా?

Somesh Kumar : ఒక ఎకరం రెండున్నర లక్షలు.ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు.. హైదరాబాద్ శివార్లలో. నమ్మలేని నిజమిది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, కేసీఆర్‌కు సలహాదారుగా పనిచేసిన సీనియర్ IAS అధికారి సోమేష్ కుమార్ కొన్న రేటు ఇది. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఎకరం రెండున్నర లక్షలకు తన భార్య పేరు మీద ఏకంగా పాతిక ఎకరాల 19 గుంటల భూమి కొన్నారు.

కేసీఆర్ జమానాలో భూముల రేట్లు పెరిగిపోయాయని.. ఇక్కడ ఎకరం అమ్మితే, ఏపీలో పదెకరాలు కొనవచ్చని నాటి మంత్రి కేటీఆర్ పదేపదే చెప్పేవారు. ధరలు పెరగడం అంటే ఇదేనా? అసలు యాచారం చుట్టుపక్కల ఎకరం రెండున్నర లక్షలు పెట్టి కొన్నట్టు సోమేష్ కుమార్‌కు చెందిన డాక్యుమెంట్లలో స్పష్టంగా ఉంది. 2018లో జరిగిన కొనుగోళ్లు ఇవి. ఆ సయంలో ఎకరం 20 లక్షల రూపాయలపైనే ఉండేదని రియల్టర్లు చెప్తున్నారు. మరి, రెండు లక్షల రూపాయలకు ఎవరైనా అమ్ముతారా?

2018లో పి.శేషకుమారి నుంచి 10 ఎకరాలు, నామని వేణుగోపాల్ నుంచి 8 ఎకరాలు, ఎల్లా వరలక్ష్మి నుంచి 7 ఎకరాల 19 గుంటలు సోమేష్ భార్య పేరుమీద కొనుగోలు చేశారు. మొత్తం పాతిక ఎకరాల 19 గుంటల భూమి కొన్నారు. అందరికీ ఎకరం 20 లక్షల రూపాయలపైనే పలికినా సోమేష్‌కు మాత్రం డెడ్‌ చీప్‌గా 2 లక్షలకే ఎలా దొరికింది? ఒకటి బ్లాక్ మనీతో నైనా కొని ఉండాలి? లేదంటే బెదిరించైనా అయి ఉండాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ IAS అధికారి అయి ఉండి.. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు డాక్యుమెంట్లలో రేటు తక్కువ చూపించడం సిగ్గుచేటు అంటున్నారు. లేదంటే ప్రభుత్వానికి చూపని ఆదాయం నుంచి మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి డాక్యుమెంట్లతో సహా దొరికిపోయారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్. ఇప్పుడు ఆయన, ఆయన్ని నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×