BigTV English
Advertisement

Thalapathy Vijay | తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ఎంట్రీ.. త్వరలో పార్టీ ప్రకటన!

Thalapathy Vijay | తలపతి విజయ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే ఆయన ఏదో ఒక పార్టీలో చేరడం లేదు. ఏకంగా సొంత పార్టీ పెట్టబోతున్నారు. తమిళ మీడియా కథనాల ప్రకారం.. విజయ్‌ని పార్టీ ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. భారత ఎన్నికల కమిషన్‌లో త్వరలోనే పార్టీ పేరుని రిజిస్టర్ చేయబోతున్నట్లు తెలిసింది.

Thalapathy Vijay | తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ఎంట్రీ.. త్వరలో పార్టీ ప్రకటన!

Thalapathy Vijay | తలపతి విజయ్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. అయితే ఆయన ఏదో ఒక పార్టీలో చేరడం లేదు. ఏకంగా సొంత పార్టీ పెట్టబోతున్నారు. తమిళ మీడియా కథనాల ప్రకారం.. విజయ్‌ని పార్టీ ప్రెసిడెంటుగా ఎన్నుకున్నారు. భారత ఎన్నికల కమిషన్‌లో త్వరలోనే పార్టీ పేరుని రిజిస్టర్ చేయబోతున్నట్లు తెలిసింది.


ఇటీవలే విజయ్‌తో సహా 200 మంది పార్టీ సభ్యులు సమావేశం అయ్యారని తమిళ మీడియా తెలిపింది. పార్టీ జెనెరల్ సెక్రటరీ, కోశాధికారిని కూడా ఎన్నుకోవడం పూర్తయందని, పార్టీ పేరుని విజయ్ మాత్రమే నిర్ణయిస్తారని సమాచారం. పార్టీ పేరులో కళగం అనే పదం తప్పకుండా ఉంటుందని విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.

అయితే 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని.. అదే సమయంలో విజయ్ రాజకీయాలలో క్రీయాశీలకంగా ఉంటారని తెలుస్తోంది.


తమిళనాడు సినీ రంగంలో రజనీకాంత్ తరువాత అంతటి పేరు, ప్రఖ్యాతలను విజయ్ సంపాదించారనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన 68 సినిమాలలో నటించారు. అయితే గత దశాబ్ద కాలంగా ఆయన రాజకీయాలలో ప్రవేశించబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకసారి ఆయన తండ్రి ప్రఖ్యాత సినీ దర్శకుడు చంద్రశేఖర్ కూడా తన కొడుకు రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు. కానీ అదంతా నిజం కాదని ఆ సమయంలో విజయ్ కొట్టిపారేశారు.

మరోవైపు విజయ్ గత కొంత కాలంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన పేదు అభిమానులకు దాన ధర్మాలు చేయడం, పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్‌లు, లైబ్రరీలు, ఉచిత ట్యూషన్, పేదలకు న్యాయ సహాయం అందించడం వంటి కార్యక్రమాలను విజయ్, ఆయన అభిమాన సంఘాలు చేస్తున్నాయి.

అలాగే ఆయన సినిమాలలో రాజకీయ కోణం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల ఆయన పలు నియోజక వర్గాలలో కార్యక్రమాలు చేపట్టి సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్, పెరియార్, కామరాజ్ వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని.. సమాజంలో మంచిని మాత్రమే తీసుకొని.. మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

ప్రస్తుతం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆమె పార్టీ బలహీనమైంది. అధికార స్టాలిన్ పాార్టీకి సరైన పోటీ ఇవ్వగలిగే బలమైన నాయకులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. ఆయనను తమిళనాడు ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా చూసే అవకారం ఉంది.

Thalapathy Vijay, announce, political party, Actor Vijay, Tami Actor Vijay, Political entry Tamil Nadu Politics, MK Stalin,

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×