Handshake Between Harmanpreet Kaur and Nigar Sultana: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asian Games 2026) భాగంగా ఇవాళ టీమిండియా ఉమెన్స్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల (India Women vs Bangladesh Women, 2nd Semi Final) మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాకు (Nigar Sultana) టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) షేక్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ సమయంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించింది బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా. అలాంటి నిగర్ కు హర్మన్ ప్రీత్ కౌర్ ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఆమెకు సిగ్గు కూడా లేదని ఫైర్ అవుతున్నారు. భారతదేశ పరువును బంగ్లాదేశ్ కాళ్ళ దగ్గర పెట్టావంటూ విమర్శలు చేస్తున్నారు.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానాకు హర్మన్ ప్రీత్ కౌర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ సందర్భంగా నీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన నిగర్ కు ఎలా కరచలనం చేస్తావంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. భారతదేశ పరువును బంగ్లాదేశ్ కాళ్ళ దగ్గర పెట్టిన హర్మన్ ప్రీత్ కౌర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె వయసు కూడా అయిపోయిందని… టీమిండియా నుంచి తొలగించాల్సిందేనని మరికొంతమంది తెరపైకి కొత్త అంశాన్ని తీసుకువస్తున్నారు. ఆమె ఇండియాకు వచ్చే లోపు… భారత క్రికెట్ నియంత్రణ మండలి యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ హిందువులపై అప్పట్లో విపరీతంగా దాడులు జరిగేవి. చాలామందిని తీవ్రంగా కొట్టి చంపారు. అయితే దీనిపై భారతీయులతో పాటు సర్కార్ పెదవి విరిచింది. దీంతో వివాదం రాజుకుంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. ఇండియాలో పర్యటించబోమని తెలిపింది. అంతకుముందు ఐపీఎల్ ఆడకుండా బంగ్లాదేశ్ క్రికెటర్ల పై బీసీసీఐ బ్యాన్ విధించింది. ఈ క్రమంలోనే రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా దాదాపు రద్దయ్యాయి. కేవలం ఐసీసీ అటు ఏషియన్ గేమ్స్ లో మాత్రమే మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లు జరుగుతున్నా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు ఇరుజట్ల క్రికెటర్లు.
Finally, a handshake between Harmanpreet Kaur and Nigar Sultana Joty 🤝🏻
BTW, during the India vs Bangladesh Women's Asia Cup 2026 Semifinal, Sultana Joty refused to shake hand with Harman 🤨 pic.twitter.com/O3jWwnMl0p
— Ajay Jadeja (@AjayJadeja171) September 20, 2026