E-Paper
Advertisement

కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!

కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు  రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!
Advertisement

Karimnagar ATM: కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున చోటుచేసుకున్న వరుస ఏటీఎమ్ దొంగతనాలు తీవ్ర కలకలం రేపాయి. వినాయక నవరాత్రుల వేళ జనాలు నిద్రపోయే సమయాన్ని ఆసరాగా చేసుకుని, పక్కా వ్యూహంతో దొంగల ముఠా ఈ దోపిడీలకు తెగబడింది.

నిమిషాల వ్యవధిలో పక్కా ప్లాన్

Advertisement

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎమ్‌లో తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు లోపలికి వెళ్లడమే ఆలస్యం.. మొదట సీసీ కెమెరాలపై స్ప్రే చల్లారు. ఆ వెంటనే సైరన్ అలారం, కెమెరా కేబుళ్లను కత్తిరించారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎమ్ మిషన్‌ను కట్ చేసి, క్షణాల్లో నగదుతో పరారయ్యారు. ఈ దురాగతమంతా కేవలం 8 నిమిషాల్లోనే పూర్తి చేయడం గమనార్హం.

పోలీసులు వచ్చేలోపే మాయం

Advertisement

ఏటీఎమ్ వద్ద అనుమానాస్పద కదలికలు గుర్తించి ఢిల్లీలోని సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వార్త తెలిసిన 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ముఠా నగదుతో జారుకుంది.

Also Read: ఐఎస్ సదన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం

తిమ్మాపూర్‌లోనూ అదే తరహా దోపిడీ

ఇదే సమయంలో ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఎస్బీఐ ఏటీఎమ్‌లోనూ దాదాపు ఇదే రీతిలో చోరీ జరిగింది. నవరాత్రుల కారణంగా అర్థరాత్రి వరకు రద్దీగా ఉండే వీధులు, తెల్లవారుజామున నిర్మానుష్యంగా మారడాన్ని ముఠా ముందే పసిగట్టింది. ఈ రెండు చోట్లా దోపిడీకి పాల్పడింది ఒకే గ్యాంగా, లేక వేర్వేరు బృందాలు పనిచేశాయా అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Related News

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో భారీ చోరీ.. విలువైన ఐఓఎస్ పరికరాలు మాయం!

ఖైరతాబాద్‌లో బిగ్ ట్విస్ట్.. దానంకు ఊహించని ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్!

ఐఎస్ సదన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం

కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్

రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

Big Stories

Advertisement
×