E-Paper
Advertisement

Bandi Sanjay: ప్రీతి శవానికి ట్రీట్మెంట్ చేశారు.. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా లేదా?

Bandi Sanjay: ప్రీతి శవానికి ట్రీట్మెంట్ చేశారు.. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా లేదా?
Advertisement

Bandi Sanjay: కేసీఆర్ కూతురు కవిత ధరించే వాచ్ విలువ 25 లక్షలు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ సరిగ్గా క్యాచ్ చేసింది. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా.. వైద్య విద్యార్థిని ప్రీతి ప్రాణాలకు లేదా? అని నిలదీశారు బండి సంజయ్. ప్రీతి చనిపోతే 10 లక్షలు ఆర్థిక సాయం మాత్రమే ప్రకటించారని మండిపడ్డారు.

ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని విమర్శించారు. ప్రీతి సెల్‌ఫోన్ డేటా డిలీట్ చేశారని.. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

సీఎం కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ.. వాటికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 4 గంటల పాటు నిరసన దీక్ష చేశారు బండి సంజయ్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. నిమ్మరసం ఇచ్చి సంజయ్ దీక్షను విరమింపజేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ నలుగురు సీఎంలు, విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కేసీఆర్ ఇతరులతో కలిసి లేఖ రాస్తే.. ఆయన అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×