Ram Charan : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్, కియారా అద్వానీలపై సాంగ్‌ను చిత్రీకరించబోతున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇప్పటి వరకు RC 15కి సంబంధించి శంకర్ అండ్ టీమ్ ఎలాంటి అప్‌డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించలేదు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే కూడా ఉంది. మరి అప్పుడైనా ఏమైనా ట్రీట్ ఉంటుందా? అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. శంకర్ ఈసారి ఏకంగా ఒకటి కాదు.. రెండు సర్‌ప్రైజ్‌లను అందించబోతున్నారట. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కాబట్టి. ఓ రోజు ముందుగా అంటే మార్చి 26న RC 15 టైటిల్ పోస్టర్‌ను, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తారట. మే నాటికి చిత్రీకరణంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై శంకర్ ఫోకస్ పెడతారట. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి RC 15ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ఆలోచనగా కనిపిస్తుంది.
RC 15లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ రోల్ రాజకీయ నాయకుడిగా అయితే, మరో రోల్ ఎన్నికలను నిర్వహించే ఐపీఎస్ అధికారిగా. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. దిల్ రాజు, శిరీష్ సినిమాను నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావటంతో RC 15పై భారీ అంచనాలున్నాయి.