Bank Holidays: బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో వారికి ఇక పండుగే.. దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 19 నుండి 23 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.
దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలవుతున్నాయి. అయితే పండుగ సందర్భంగా అన్ని ఆఫీసులు, స్కూల్లు మూతపడ్డాయి. అలాగే బ్యాంకులు కూడా వరుసగా 5 రోజులు మూసి వేశారు. మీకు ఏదైన బ్యాంకులో పని ఉంటే సెలవులు అయిపోయిన తర్వాత వెళ్లడం మంచిది. అయితే వరుస సెలవులు రావడంతో నగర ప్రాంతంలో ఉండేవారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అలాగే ఈ సెలవులు ఏ ఏ రోజూ అంటే..
అక్టోబర్ 19-ఆదివారం
19న ఆదివారం కావున అది సాధారణ సెలవు కావడంతో దేశంలో అన్ని బ్యాంకులు మూసివేస్తారు.
అక్టోబర్ 20 సోమవారం- దీపావళి
ఇక సోమవారం దీపావళి పండుగ ప్రధానం కావడంతో ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు.. దీంతో బ్యాంకులకు ఆ రోజూ కూడా సెలవు..
అక్టోబర్ 21 మంగళవారం- అమావాస్య దీపావళి రెండవ రోజు
దీపావళి పండుగ మంగళవారం కూడా చేసుకోవడంతో ముంబై, నాగ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్, బేలాపూర్ వంటి నగరాల్లో బ్యాంకులకు సెలవు.. మిగతా ప్రాంతాల్లో యథావిధిగా నడుస్తాయి.
అక్టోబర్ 22 బుధవారం- గోవర్ధన్ పూజ /అన్నకూట్
22న గోవర్ధన్ పూజ కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇది పెద్ద పండుగ.. అలాగూ నూతన సంవత్సరంగా కూడా భావిస్తారు. దీంతో హ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, జైపూర్, లక్నో, కాన్పూర్, డెహ్రాడూన్, బేలాపూర్ నగరాలలో బ్యాంకులకు సెలవు..
అక్టోబర్ 23 గురువారం- భాయ్ దూజ్
సోదర సోదరీమణులు జరుపుకునే ఈ భాయ్ దూజ్ పండుగ కారణం వల్ల అహ్మదాబాద్, కోల్‌కతా, ఇంఫాల్, లక్నో, కాన్పూర్, సిమ్లా వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు..
Also Read: అందరూ మెచ్చేలా.. పిల్లలకు నచ్చేలా.. విద్య శాఖపై సీఎం రేవంత్ ఫోకస్
అయితే బ్యాంకులు మూసేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్ డ్రా వంటి ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి..