Hyderabad News: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి తెరలేపాడు ఓ ఆర్ఎంపీ వైద్యుడు. మియాపూర్ లోని మయూరినగర్‌కు చెందిన RMP వైద్యుడు అలీ, నిజాంపేట్‌లోని రేష్మా క్లీనిక్ పేరుతో గత 20 ఏళ్లుగా నడుపుతున్నాడు. సైడ్ బిజినెస్ చిట్టీల వ్యాపారం మొదలెట్టి అటు క్లీనిక్, ఇటు చిట్టీల వ్యాపారం కొనసాగించాడు. కస్టమర్లు అధికంగా రావడంతో కొన్నేళ్లలోనే 50లక్షలు, 30లక్షలు, 20లక్షల చిట్టీలు నిర్వహించారు.
బండారీ లే అవుట్ కాలనీలో ఉంటున్న మహేశ్‌ను అకౌంటెంట్‌ను నియమించుకున్నాడు. గత 2 ఏళ్లుగా చిట్టీల డబ్బులు వసూలు కాకపోవడంతో కష్టాల్లో కూరుకుపోయాడు. దీంతో అలీపై ఒత్తిడి పెరిగింది. ఈనెల 8న క్లీనిక్‌లో సూసైడ్‌కు యత్నించాడు. ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అలీ భార్య ఫిర్యాదు మేరకు ఆ రోజే పోలీసులు కేసు నమోదు చేశారు. అలీ మళ్లీ క్లీనిక్‌కు వస్తుండటంతో.. బాధితులు చిట్టీల డబ్బుల కోసం క్లీనిక్, ఇంటికి క్యూ కట్టారు. చిట్టీల డబ్బుల గురించి అలీ, అతడి అకౌంటెంట్ మహేశ్ మధ్య వివాదం జరిగింది.
మహేశ్ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సూసైడ్ నోటును ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. మహేశ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో బాధితులు రేష్మా క్లీనిక్ వద్దకు చేరుకుని అలీని నిలదీశారు. తనను అకౌంటెంట్ మోసగించాడని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు మాత్రం అలీనే తమను మోసగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు నష్టపోయిన మొత్తం కోట్లల్లో ఉంటే.. కేసును ఆర్థిక నేరాల విభాగానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.