Samsung Support End| శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లు ఉపయోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ గెలాక్సీ ఫోన్లో కొన్ని బడ్జెట్ మోడల్స్ కు శాంసంగ్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ నిలిపివేసింది. కంపెనీ నాలుగు పాపులర్ గెలాక్సీ ఫోన్‌లకు సపోర్ట్ నిలిపేసింది. ఆ జాబితాలో నాలుగు సిరీస్ ఉన్నాయి. గెలాక్సీ A03s, గెలాక్సీ A52s, గెలాక్సీ F42 5G, గెలాక్సీ M32 5G. ఈ ఫోన్‌లకు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు రావు.
సాఫ్ట్ వేర్ సపోర్ట్ నిలిచిపోవడంతో గెలాక్సీ యూజర్లు భారీగా ప్రభావితమవుతారు. ఈ ఫోన్‌లకు ఇక సెక్యూరిటీ ప్యాచ్‌లు లేదా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లు రావు. దీనివల్ల హ్యాకర్లు పాత వల్నరబిలిటీలను ఉపయోగించి మీ ఫోన్ ను హ్యాక్ చేయవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం, డేటా ప్రమాదంలో పడవచ్చు. భవిష్యత్తులో కొత్త ప్రమాదంలో పొంచి ఉంటాయి.
ఈ నాలుగు గెలాక్సీ మోడల్‌లు 2021లో లాంచ్ అయ్యాయి. శామ్‌సంగ్ నాలుగేళ్లు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తామని ఆ సమయలో హామీ ఇచ్చింది. ఆ గడువు ఇప్పుడు పూర్తి అయింది. సెప్టెంబర్ 2025 నుండి అధికారికంగా సపోర్ట్ ఆగిపోయింది. కంపెనీ చెప్పిన టైమ్ లైన్ ప్రకారమే ఇదంతా జరిగింది.
ఈ ఫోన్‌లలో ఏదైనా మీ వద్ద ఉంటే.. వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవడం గురించి ఆలోచించండి. A03s, F42 5G లేదా M32 5G ఉపయోగించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సపోర్ట్ లేని ఫోన్‌లు సెక్యూరిటీ రిస్క్‌కు గురవుతాయి. వీటి స్థానంలో ఇప్పుడు కొత్త మోడల్స్ ఉన్నాయి. ఉదాహరణకు, గెలాక్సీ A07, గెలాక్సీ F56, గెలాక్సీ M36 మంచి ఆప్షన్‌లు. A52s యూజర్లకు గెలాక్సీ A56 లేటెస్ట్ అప్‌గ్రేడ్ అవుతుంది.
శామ్‌సంగ్ ఇప్పుడు వన్ UI 8ని పుష్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రన్ అవుతుంది. వన్ UI 8లో కొత్త ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన AI కెపాబిలిటీలు, కస్టమైజేషన్ ఆప్షన్‌లు, బ్యాటరీ పెర్ఫామెన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేశారు.
ఇప్పుడు వన్ UI 8 అప్‌డేట్ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లకు వచ్చింది. గెలాక్సీ S24 మోడల్‌లు, Z ఫోల్డ్ 6. ఇప్పుడు మిడ్-టైర్ A, M సిరీస్ ఫోన్‌లకు రోల్ అవుట్ అవుతోంది. త్వరలో మెజారిటీ మోడల్స్‌లకు అందుబాటులోకి వస్తుంది.
మీ ఫోన్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. రెగ్యులర్ అప్‌డేట్‌లు వైరస్‌లు, హ్యాకర్ల నుండి రక్షిస్తాయి. కొత్త సైబర్ అటాక్‌ల డేంజర్ పాత ఫోన్‌లకు పొంచి ఉంటుంది. అందుకే అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల ఆన్‌లైన్ సేఫ్టీ మెయింటైన్ చేయవచ్చు. మీ ఫోన్‌లో సెక్యూరిటీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి. మీ వ్యక్తిగత డేటా విలువైనది. దాన్ని కాపాడుకోండి.
Also Read: ఉచిత వైఫైతో ప్రమాదం… మీ ఫోన్, కంప్యూటర్ అంతా హ్యాక్.. ఈ జాగ్రత్తలు పాటించండి