Pragathi Bhavan : రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు ఎత్తివేశారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను.. అంబేడ్కర్ ప్రజా భవన్‌గా మారుస్తానని ఇదివరకే రేవంత్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వద్ద రోడ్డుపై పెట్టిన బారీకేడ్లు తొలగించారు.
ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్‌కు అనుమతించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రోడ్డుపైన ఉన్న కంచెలను తీసే చర్యలు చేపట్టారు.