E-Paper
Advertisement

Paigah Palace : సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీస్ గా పైగా ప్యాలెస్.. పరిశీలించిన ఉన్నతాధికారులు

Paigah Palace : సీఎం రేవంత్ క్యాంప్ ఆఫీస్ గా పైగా ప్యాలెస్.. పరిశీలించిన ఉన్నతాధికారులు
Advertisement

Paigah Palace : సీఎం క్యాంప్ ఆఫీస్‌ కోసం పైగా ప్యాలెస్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బేగంపేటలోని పైగా ప్యాలెస్ ను సీఎస్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీశారు.

నాలుగు ఎకరాలలో ఉన్న పైగా ప్యాలెస్.. సీఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే సచివాలయానికి ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సీఎం చేరుకుంటాడని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

బేగంపేటలోని పైగా ప్యాలెస్ పరిసరాల్లో ఎలాంటి రెసిడెన్షియల్ ఏరియాలేదు. దీంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవన్నది అధికారుల ఆలోచన. సీఎం కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను ఆపకూడదని, ప్రజలతోనే ప్రయాణం చేద్దామని రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు.

జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు ఆలోచన చేశారు. అయితే జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టి ట్యూట్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా ఉంది. దీంతో ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక.. అధికారుల చూపు పైగా ప్యాలెస్ పై పడింది. ఇక్కడైతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు. పైగా ప్యాలెస్ హెచ్ఎండీఏ స్వాధీనంలో ఉంది. ఆరో నిజాం నవాబు పైగా ప్యాలెస్ ను కట్టించాడు. ఇక్కడ పైగా ఫ్యామిలీ ఉండడంతో ఈ ప్యాలెస్ కు పైగా ప్యాలెస్ అని పేరు పెట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×