E-Paper
Advertisement

BIG TV Exclusive Election Survey : బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే.. తెలంగాణ పల్స్ ఇదే

BIG TV Exclusive Election Survey : బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే.. తెలంగాణ పల్స్ ఇదే
BIG TV Exclusive Election Survey

BIG TV Exclusive Election Survey : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫలితంగా తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. కేవలం 50 రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మరి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేదంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందా? మరి బీజేపీ ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉండనుంది? కమలం కలగంటున్నట్లు హంగ్‌ వచ్చే చాన్సెస్‌ ఏ మేరకు ఉన్నాయి? మరి తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏంటి? పార్టీలు, అభ్యర్థుల పట్ల ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది. రెండు సార్లు అధికారంలో ఉన్న గులాబీ గవర్నమెంట్‌పై వ్యతిరేకత ఎంత? బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య బీ టీమ్ ఆరోపణలు ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి? ఇలా బిగ్ టీవీ తెలంగాణలోని ప్రతీ నియోజవర్గంలో ఎక్స్‌క్లూజివ్‌ సర్వే చేసింది. ప్రతీ నియోజకవర్గం నుంచి 600 శాంపిల్స్‌కు తగ్గకుండా ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం ఏంటో పరిశీలిద్దాం.

తెలంగాణ పరిధిలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల అభిప్రాయాలను బిగ్‌ టీవీ సేకరించింది. ఆ సర్వే డీటెయిల్స్‌తో ఓవరాల్‌గా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో క్రోడీకరించింది. ఓవరాల్‌గా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికార BRS పార్టీకి 46 నుంచి 54 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 62 నుంచి 69 సీట్లు దక్కనున్నాయి. ఇక బీజేపీకి 3 నుంచి 6 స్థానాలు.. మజ్లిస్‌ పార్టీకి 5 నుంచి 7 స్థానాలు రావచ్చని..BSPకి 0 నుంచి 1 స్థానం దక్కవచ్చని బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఎలక్షన్‌ సర్వేలో ఓటర్ల నాడిగా తేలింది.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా మేజిక్‌ ఫిగర్‌ 60ని కాంగ్రెస్‌ పార్టీ దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరైన సాధారణ మెజార్టీని కాంగ్రెస్ పార్టీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.సాధారణ మెజార్టీ కంటే 2 నుంచి 9 స్థానాలు అధికంగా దక్కించుకోనుందని బిగ్‌ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. మొత్తానికి ఈ సారి తెలంగాణ ఎలక్షన్స్‌లో అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోరు జరగనుంది. బీజేపీ ఇమేజ్ క్రమంగా తగ్గుతున్నట్లు బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×