BigTV English

Apsara Murder: అప్సరను బొడ్రాయికి బలి ఇచ్చాడా? సాయికృష్ణ పూజారే కాదా? బిగ్ ట్విస్ట్..

Apsara Murder: అప్సరను బొడ్రాయికి బలి ఇచ్చాడా? సాయికృష్ణ పూజారే కాదా? బిగ్ ట్విస్ట్..
pujari apsara murder

Apsara murder in Hyderabad: పూజారంటే ఎలా ఉండాలి? సాయికృష్ణ ఎలా ఉన్నాడు? పూజారికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదతనికి. యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. ఆమెను దారుణంగా హత్య చేయడం.. చూస్తుంటే ఛీ.. వాడు పూజారేంటి..అనిపిస్తుంది. అక్కడితో అయిపోలేదు అతడి అరాచకం. కరుడుగట్టిన నేరగాళ్లను మరిపించేలా.. ఉన్నాయి అతని దారుణాలు.


జూన్ 3న అప్సరను దారుణంగా హత్య చేసి.. డెడ్‌బాడీ మ్యాన్‌హోల్‌లో పడేసి.. పైన మట్టి, ఇసుకు, సిమెంట్‌తో పూడ్చేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలీనట్టు.. మళ్లీ పూజారి పనుల్లో మునిగిపోయాడు. హత్య చేశాననే పశ్చాత్తాపం, పాపభీతి ఏమాత్రం లేకుండా.. జూన్ 5న సరూర్‌నగర్‌లో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశాడు.

70 ఏళ్లుగా సరూర్‌నగర్‌లో.. బొడ్రాయి ఉత్సవాలు జరగలేదు. అది గ్రామానికి మంచిది కాదని.. పూజారి సాయికృష్ణనే గ్రామ పెద్దలకు చెప్పి ఒప్పించాడు. జూన్ 5న బొడ్రాయి పూజకు ముహూర్తం కూడా పెట్టాడు. అలాంటిది.. జూన్ 3 అర్థరాత్రి అప్సరను చంపడం.. ఆ తర్వాత బొడ్రాయికి పూజలు చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్సరను బొడ్రాయికి బలిచ్చాడా? అనే అనుమానమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ బొడ్రాయిని అపవిత్ర చేశాడని గ్రామస్తులంతా మండిపడుతున్నారు.


సాయికృష్ణ అసలు పూజారే కాడంటూ అతని తండ్రి మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎమ్‌బీఏ చదివి, కాంట్రాక్టర్‌గా చేస్తున్న సాయికృష్ణ.. ఈ మధ్యనే పూజలు గట్రా చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. గుడిలో చాలాసార్లు ఆ అమ్మాయిని తాను చూశానని.. వారి విషయం తనకు ముందే తెలిసుంటే పోలీసులతో చెప్పి కౌన్సిలింగ్ అయినా ఇప్పించేవాడినని అన్నారు. తమ కుమారుడు అప్సరను హత్య చేశాడంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అంటున్నాడు ఆ తండ్రి.

మరోవైపు, అప్సర అంత్యక్రియల అనంతరం.. సాయికృష్ణ పూజారిగా ఉన్న బంగారు మైసమ్మ ఆలయాన్ని సంప్రోక్షించారు పండితులు. త్వరలోనే శాంతి హోమం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Apsara murder

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×