E-Paper
Advertisement

Kodangal : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొడంగల్ కింగ్ ఎవరు ?

Kodangal : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొడంగల్ కింగ్ ఎవరు ?

Kodangal Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 2,30,415 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,14,140 మంది ఉన్నారు. మహిళలు 1,16,099 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (23-08-2023)

బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 43 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే 54 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డికి 40 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డి 58 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది.

సర్వేల్లో భారీ మార్పు..

రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు ఓట్ల శాతం తగ్గుతుండగా.. కాంగ్రెస్ బలం కొంతమేర పెరిగిందని స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ కు 3 శాతం ఓట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్ కు 7 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్లు బీజేపీ వైపు ఆసక్తి కనబరచడం లేదు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడం వల్ల కొండగల్ పై ఫోకస్ మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్న సంకేతాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు హస్తం ఫేట్ మార్చేలా ఉన్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలకం కానున్నారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా పందెంకోళ్లు 1 కంటే 2లో రేవంత్ రెడ్డి వోట్ షేర్ 4 శాతం పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 18 శాతం ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై రేవంత్ గెలిచే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×