BigTV English

Smartphone Cameras : స్మార్ట్‌ఫోన్ కెమెరాలు వచ్చె.. ఢాం.. ఢాం..

Smartphone Cameras :  స్మార్ట్‌ఫోన్ కెమెరాలు వచ్చె.. ఢాం.. ఢాం..

Smartphone Cameras : స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మనలో ఫొటోగ్రాఫర్ బయటకి వచ్చేస్తాడు. క్లిక్ క్లిక్ మంటూ తెగ ఫొటోలు తీసేస్తుంటాం. రాన్రాను ఇమేజ్ సెన్సర్ల సైజును మరింత చిన్నగా చేసే టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీకి ఆదరణ బాగా పెరిగింది.ఫిల్మ్ ప్రాసెసింగ్ బాధ ఉండదు. అలా క్లిక్‌మనిపించగానే.. ఇలా ఫొటోను చూసుకునే సౌలభ్యం దీని వల్ల సమకూరింది. అత్యంత ఖరీదైన లెన్స్ కెమెరాలతో తీసిన ఫొటోల క్వాలిటీకి తీసిపోకుండా స్మార్ట్‌ఫోన్ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఎంతగానో మెరుగుయ్యాయి.


ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా లెన్స్ కెమెరాలను మోసుకెళ్లే బాధ కూడా తప్పింది. సగటు వినియోగదారుడి అవసరాలు తీరేలా స్మార్ట్‌పోన్ కెమెరాలు ఉంటున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న చందాన స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ కారణంగా కెమెరా-ఫొటో ఎక్విప్‌మెంట్ ఇండస్ట్రీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఏదో కొద్ది మంది నిపుణ ఫొటోగ్రాఫర్లు, ఔత్సాహికులు తప్ప మిగిలిన వారెవరూ లెన్స్ కెమెరాలను వినియోగించడమే లేదు.

ఆఖరికి డిజిటల్ కెమెరాలకూ ఆదరణ సన్నగిల్లుతోందని జపాన్‌కు చెందిన కెమెరా అండ్ ఇమేజింగ్ ప్రోడక్ట్స్అసోసియేషన్(CIPA) పేర్కొంది. ఓఎం డిజిటల్ సొల్యూషన్స్(పూర్వపు ఒలంపస్ కంపెనీ), కెనాన్, నికాన్ వంటి దిగ్గజ సంస్థలు ఈ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నాయి. 2010-23 మధ్య ప్రపంచవ్యాప్తంగా కెమెరా షిప్‌మెంట్లు 93% పడిపోయాయని CIPA తెలిపింది. అంతకుముందు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ పరిశ్రమ అభివృద్ధి ఒక్కసారిగా పడిపోయింది. బిల్టిన్ లెన్స్‌లతో కూడిన డిజిటల్ కెమెరాల అమ్మకాల క్షీణతే ఇందుకు కారణం.


2010లో డిజిటల్ కెమెరాల అమ్మకం ఉచ్ఛస్థాయికి చేరింది. 120 మిలియన్ కెమెరాలు అమ్ముడుపోయిన ఉజ్వలమైన
గతమది. 2000 సంవత్సరం వరకు ఫోటోగ్రఫీ రంగాన్ని శాసించిన ఫిల్మ్ కెమెరాలను.. అనంతరం పదేళ్ల కాలంలోనే డిజిటల్ కెమెరాలు పూర్తిగా ఆక్రమించేశాయి. గత పుష్కరకాలంగా విస్తరించిన స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీ ఇప్పుడు డిజిటల్ కెమెరాలను కనుమరుగయ్యేలా చేస్తోంది. 2010లో 109 మిలియన్ కెమెరాలు అమ్ముడుపోగా.. నిరుడు CIPA సభ్యసంస్థలు కేవలం 2 మిలియన్ కెమెరాలను విక్రయించగలిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.భారత్ సహా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణకొరియా, చైనా, జపాన్, అమెరికా దేశాల్లో డిజిటల్ కెమెరాలను వినియోగించేవారు గత నాలుగేళ్లలోనే 15-25% మేర తగ్గారు. ఈ లెక్కన డిజిటల్ కెమెరాలను అతి త్వరలోనే స్మార్ట్‌ఫోన్ కెమెరాలు భర్తీ చేసేస్తాయన్న మాట.

Related News

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Big Stories

×