E-Paper
Advertisement

Mahabubabad : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహబూబాబాద్ మహారాజు ఎవరు ?

Mahabubabad : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహబూబాబాద్ మహారాజు ఎవరు ?
Advertisement

Mahabubabad Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 2,45,943 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,21,441 మంది ఉన్నారు. మహిళలు 1,24,289 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (04-09-2023)

Advertisement

బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ 41 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మురళీ నాయక్ బరిలోకి దిగితే 38 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. బీజేపీకి 8 శాతం మాత్రమే ఓట్లు పోల్ సర్వే తేల్చింది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..

Advertisement

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ నాయక్ కు 42 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ 45 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. బీజేపీకి 8 శాతం ఓట్లు పోల్ అవుతాయని సర్వేలో తేలింది.

పెరిగిన గ్రాఫ్..

రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ బలం కొంతమేర పెరిగిందని స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ కు 1 శాతం ఓట్లు పెరుగుతుండగా.. కాంగ్రెస్ కు 7 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. బీజేపీ తటస్థంగా ఉంది.

మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. మురళీనాయక్ కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు విజయానికి బాటలు వేస్తున్నాయని, బిగ్ టీవీ సర్వేలో తేలింది. గత సర్వేకు ఇప్పటికి ఆయన ఓటు షేర్ ఏకంగా 7 శాతం పెరిగింది. ఇప్పటికిప్పుడు మహబూబాబాద్ లో విజయం మురళీనాయక్ వైపే ఉంది. గతంలో 13 శాతం మంది ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ కన్ఫామ్ కావడం వల్ల అందులో 7 శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, ఒక్క శాతం మంది మాత్రమే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×