E-Paper
Advertisement

TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన.. బండి సంజయ్ అరెస్ట్

TSPSC: పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన.. బండి సంజయ్ అరెస్ట్
Advertisement

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. శుక్రవారం ఈ వ్యవహారంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‌లోని గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. దీక్ష అనంతరం ఆయన టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆరెస్ట్ చేశారు.

ముందుగా బండి సంజయ్ బీజేపీ కార్యాలయం నుంచి గన్‌పార్క్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌తో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్తామని బండి సంజయ్ ప్రకటించారు.

Advertisement

ఈక్రమంలో పోలీసులు గన్‌పార్క్ వద్దకు చేరుకొని బండి సంజయ్, బీజేపీ నేతలను అడ్డుకున్నారు. వారిమధ్య తోపులాట జరిగి.. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Kavitha : కవిత అభ్యర్థన తిరస్కారం.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Advertisement

Space Tourism:స్పేస్‌కు వెళ్లొద్దాం..! 2030 నుండి ప్రయాణం..

Tags

Related News

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

Big Stories

Advertisement
×