BigTV English

Robots:వర్క్ ప్రెజర్ నుండి బయటపడేసే రోబోలు

Robots:వర్క్ ప్రెజర్ నుండి బయటపడేసే రోబోలు

Robots:రోజూవారీ జీవితంలో మనుషులు ఎన్నో సమస్యలకు ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా యవ్వనం వచ్చేసరికి ఎక్కువశాతం ఇబ్బందులు వారు పనిచేస్తున్న చోటులోనే ఎదుర్కుంటారు. వర్క్ ప్రెజర్ లాంటివి ఎన్నో ప్రస్తుతం యువతను ఇబ్బందుల్లోకి తోస్తున్నాయి. ఈ ప్రెజర్‌ను తగ్గించుకోవడానికి పరిశోధకులు సైతం ఎన్నో చిట్కాలు చెప్తున్నారు. తాజాగా రోబోలు కూడా ఉద్యోగులు ఎదుర్కుంటున్న వర్క్ ప్రెజర్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఈరోజుల్లో చాలామంది యువత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు వారిని డిప్రెషన్‌లోకి తోస్తున్నాయి. అలాంటి వారికి థెరపీ అవసరం. ప్రస్తుతం రోబోలు కూడా థెరపీకి ఉపయోగపడుతున్నాయి. అంతే కాకుండా రోబోలు చేసే థెరపీ తమకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేషెంట్లు సైతం చెప్తున్నారు. అందుకే మరెన్నో విభాగాల్లో మనుషులపై ప్రెజర్ తగ్గించడానికి రోబోలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వర్క్ ప్లేస్‌లో మానసిక ఉల్లాసాన్ని పెంచడానికి రోబోలు కోచ్‌లలాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఈ రోబోలు చూడడానికి ఎలా ఉంటాయనేది ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వారు చెప్తున్నారు. రోబోల ద్వారా వెల్ బీంగ్ సెషన్స్‌లో 26 ఉద్యోగులు పాల్గొన్నారు. నాలుగు వారాల పాటు ఈ సెషన్స్ కొనసాగాయి. అయితే అన్ని రోబోల స్పీచ్, వాయిస్‌లు ఒకేలా ఉన్నా.. అవి ఎలా ఉన్నాయనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందని పరిశోధకులు గమనించారు.


కోచ్‌లాగా పనిచేస్తున్న రోబోలతో తమ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉందని ఉద్యోగులు చెప్తున్నారు. రియల్ వరల్డ్‌తో రోబోలతో ఇంటరాక్షన్ కాస్త వేరే విధంగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి అవి మనుషుల అంచనాలు అందకపోవచ్చు. బొమ్మలలాగా ఉండే చిన్న రోబోలను చూడడానికి ఇష్టపడిన వారు కూడా మాట్లాడడానికి మాత్రం కోచ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది వారి వర్క్ ప్రెజర్ తగ్గిస్తున్నట్టు తేలింది.

Galaxies : ఒకేసారి 25 వేల గ్యాలక్సీలు క్యాప్చర్.. వెబ్ టెలిస్కోప్ రికార్డ్..

Fire: మంటల్లో స్వప్నలోక్.. లోపల ఉన్నవాళ్లు సేఫేనా?

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×