Big Stories

Munugode by Poll : చౌటుప్పల్, చండూరు.. బీజేపీ ఆశలు ఫసక్..

Munugode by Poll : మునుగోడుపై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ. RRR కి తోడుగా మరో R ని అసెంబ్లీకి పంపించాలని ఆశ పడింది. కానీ, కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. బలమైన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కారు స్పీడు ముందు నిలవలేకపోయారు. రెండు రౌండ్లు మినహా.. మిగతా 13 రౌండ్ల ఓట్ల లెక్కింపులోనూ ఓటమి పాలయ్యారు.

- Advertisement -

బీజేపీ ఆశలన్నీ చౌటుప్పల్, చండూరు మండలాలపైనే. కమలనాథులు ఆశించినట్టుగానే చౌటుప్పల్ లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించగలిగారు. రెండు, మూడు రౌండ్లలో చౌటుప్పల్ నుంచే ఆ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అయితే, ఆ మండలంలో భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తే.. సుమారు 700 ఓట్లకు మాత్రమే పరిమితమైంది ఆధిపత్యం. ఇక ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు బీజేపీ. రౌండ్ రౌండ్ లోనూ కారు హవా కొనసాగింది. టాప్ గేర్ లో దూసుకుపోయింది.

- Advertisement -

ఇక చండూరు మండల ఓట్ల లెక్కింపు వచ్చేసరికి మళ్లీ బీజేపీలో ఆశలు చిగురించాయి. కనీసం ఆ మండలంలోనైనా కాస్త ఓదార్పు దక్కుతుందుకుంటే అక్కడా నిరాశే మిగిలింది. పోలింగ్ నాడు సమయం మించిపోయాక కూడా చండూరు పోలింగ్ కేంద్రాల ముందు భారీగా ఓటర్లు క్యూ లో ఉన్నారు. అర్థరాత్రి వరకూ సాగింది అక్కడ పోలింగ్. ఆ ఓటింగ్ అంతా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనని.. అందులో మెజార్టీ శాతం బీజేపీకే పడతాయని భావించారు. యువ ఓటర్లు ఎక్కువగా కనిపిండంతో పువ్వు వికసిస్తుందని అంచనా వేశారు. కానీ, చండూరు మండల ఓట్ల కౌంటింగ్ లోనూ కారు పార్టీ పట్టు కొనసాగింది. దీంతో చండూరుకు చెందిన 11వ రౌండ్ ఫలితాలు రాగానే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం బోసి పోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News