Big Stories

Walnuts : వాల్‌నట్స్‌ ఏ సమయంలో తినాలి?

Walnuts : ప్రస్తుతకాలంలో డ్రై ఫ్రూట్స్ వాడకం చాలా పెరిగింది. ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ తినేందుకు అలవాటుపడ్డారు. వాల్‌నట్స్‌ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఇవి తినేందుకు ఇష్టం చూపించరు. ఎందుకంటే ఇది వగరుగా ఉంటుంది. ఈ వాల్‌నట్స్ నీటిలో నానబెట్టి తింటే మంచిది. ఒక 3 వాల్‌నట్స్‌ని రాత్రి నానబెట్టి ఉదయం తొక్కతీసి తినాలి. తొక్క తీయకపోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. నానబెట్టి తినటం వలన తేలికగా జీర్ణం అవుతుంది. ఇందులో కార్బోహైడ్రేడ్స్, కొవ్వు పదార్ధాలు, పొటాషియం, సోడియం, పీచుతో పాటు విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. ఈ వాల్‌నట్స్‌లో అసలు కొలస్ట్రాల్ ఉండవు. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళనను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కూడా బాగా పెంచుతుంది. ఈ వాల్‌నట్స్‌లోని పొటాషియం, మాగ్నీషియం, జింక్‌లాంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, మలబద్దకం, అజీర్ణం రాకుండా చేస్తాయి. మధుమేహాన్ని అదుపు చేసే లక్షణాలు వాల్‌నట్స్‌లో అధికంగా ఉన్నాయి. ప్రతిరోజు మూడు నానబెట్టిన వాల్‌నట్స్ తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి మంచి కొలస్ట్రాల్‌ స్థాయిని పెంచుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ వాల్‌నట్స్‌ తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి తొందరగా మనకు ఆకలి ఉండదు. దాంతో బరువు కూడా తగ్గుతారు. ఇందులో ఉండే మెలటోనిన్ వల్ల నిద్రకూడా బాగా పడుతుంది. వీటిలో ఉండే కాంపౌండ్స్ వల్ల వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వాల్‌నట్స్‌ మన మెదడు మీద ఎక్కువగా ప్రతిస్పందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ, ఫ్లెవనాయిడ్స్ జ్ఞాపకశక్తి లోపానికి కారణమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ని నాశనం చేస్తుంది. నానబెట్టిన వాల్‌నట్స్‌ని ఉదయం పరగడుపున తినొచ్చు లేదా రాత్రి పడుకునే ముందు తినాలి. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా అందుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News