E-Paper
Advertisement

Telangana Municipal Elections: బీజేపీ చీఫ్‌కి కొత్త టాస్క్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్, త్రిముఖ వ్యూహాం

Telangana Municipal Elections:  బీజేపీ చీఫ్‌కి కొత్త టాస్క్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్, త్రిముఖ వ్యూహాం
Advertisement

Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ చేసింది. ఆ పార్టీ కొత్త చీఫ్‌ నితిన్ నబీన్‌ తొలుత తెలంగాణపై ఫోకస్ చేశారు. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల ఇంఛార్జిగా మంత్రి ఆశిష్ షేలర్ నియమించారు. ఆయనతోపాటు కో-ఇంఛార్జులుగా అశోక్, రేఖా శర్మ ఉన్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

Advertisement

బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్‌‌కు కొత్త టాస్క్ రెడీ అయ్యింది. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. మంగళవారం ఉదయం పార్టీ ఛీప్‌గా బాధ్యతలు చేపట్టిన నితిన్, సాయంత్రం నాటికి మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు ఇన్‌ఛార్జ్‌ని నియమించారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్ ఇంఛార్జిగా నియమించారు.

కో-ఇంఛార్జులుగా రాజస్థాన్ మాజీ బీజేపీ చీఫ్ అశోక్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ వ్యవహరించనున్నారు. పంచాయతీ ఎన్నికలు పెద్దగా పట్టించుకోలేదు తెలంగాణ బీజేపీ. మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు.

Advertisement

ఎన్నికల ఇన్ ఛార్జిని నియమించిన బీజేపీ హైకమాండ్

పార్టీని నమ్మకున్నవారు ఎవరున్నారు? కొత్తగా మిగతా పార్టీల నుంచి వచ్చినవారు ఎవరు? మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనే‌దానిపై హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారట ఆయన. వాటిని పరిశీలించిన పార్టీ హైకమాండ్,  మంగళవారం సాయంత్రం నాటికి ఇన్‌ఛార్జ్ ఒకరు, కో-ఇన్ ఛార్జులుగా మరో ఇద్దర్ని నియమించారు.

ఇప్పటికే జిల్లాల వారీగా రాష్ట్ర నేతలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటించారు తెలంగాణ చీఫ్ రామచందర్‌రావు. వారికి మద్దతుగా పార్టీ హైకమాండ్ నియమించినవారు తోడయ్యారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ వ్యూహం బీజేపీ అవలంభించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల కన్నా, పట్టణ ప్రాంతాల ఓటర్ల వైపు ఫోకస్ చేసింది.

ALSO READ:  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ..  దానిపై తేల్చండి?

ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నమ్ముకున్నవారికి అవకాశం ఇవ్వాలన్నది తొలి పాయింట్. రెండోది మిగతా పార్టీల నుంచి వలస వచ్చినవారికి. మూడోది గెలుపు గుర్రాలపై ఎవరనేది దానిపై దృష్టి కేంద్రీకరించనుంది. ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొనడం ఖాయం. ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీజేపీ, ఇంకో వైపు బీఆర్ఎస్‌తోపాటు జనసేన, టీడీపీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×