E-Paper
Advertisement

Road Accident: హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పై కారు బోల్తా.. స్పాట్‌లో నలుగురు

Road Accident: హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్ పై కారు బోల్తా.. స్పాట్‌లో నలుగురు
Advertisement

Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బేగంపేట ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు గాలిలో పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు ముందు భాగం ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, కారు అతివేగంతో ఉందా లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Advertisement

Also Read: బ్రేకింగ్.. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ రిటైర్మెంట్

ఈ ప్రమాదం కారణంగా బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్ సహాయంతో బోల్తా పడిన కారును అక్కడి నుంచి తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నగరంలో వర్షం కురుస్తున్న సమయంలో లేదా రద్దీగా ఉండే ఫ్లైఓవర్లపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితిని పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×