BigTV English

Rahul Gandhi: మోదీ మెయిన్ టార్గెట్ అదేనా?.. రాహుల్, వాట్ నెక్ట్స్?

Rahul Gandhi: మోదీ మెయిన్ టార్గెట్ అదేనా?.. రాహుల్, వాట్ నెక్ట్స్?
rahul gandhi modi

Rahul Gandhi: ఎంపీగా రాహుల్ గాంధీపై వేటు వేశారు. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయాలన్నారు. కాంగ్రెస్ ఎంతగా లొల్లిలొల్లి చేస్తున్నా.. బీజేపీ ఏమాత్రం తగ్గట్లేదు. పైగా మరింత మెలేస్తోంది. కాంగ్రెస్‌కు, రాహుల్‌కు రాజకీయంగా ఊపిరాడకుండా చేస్తోంది. బీజేపీ బిగ్ మూవ్‌కి.. హస్తం పార్టీ ఆగమాగం అవుతోంది. వాట్ నెక్ట్స్? ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. న్యాయ పోరాటం, రాజకీయ ఆరాటమే ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న ఆప్షన్స్.


కాంగ్రెస్.. ఇప్పుడు దేశంలో కకావికలం అయిన పార్టీ. గతమెంతో ఘనమైనా.. వర్తమానంలో అనేక వర్రీలు. నాయకత్వ లేమి ఆ పార్టీకి బిగ్ మైనస్. రాహుల్ గాంధీ మాత్రమే కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఆశాకిరణం. ఈ విషయం తెలిసే.. గాంధీనే నేరుగా టార్గెట్ చేసింది బీజేపీ. నేషనల్ హెరాల్డ్ కేసుతో సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని కార్నర్ చేసినా.. అదంతగా వర్కవుట్ అయినట్టు లేదు. ప్లాన్-బి కోసం చూస్తున్న కమలనాథులకు రాహుల్ గాంధీనే అనుకోని అవకాశం ఇచ్చారు. మోదీ ఇంటిపేరుపై పరువునష్టం కేసులో క్షమాపణలు చెప్పిఉంటే పరిస్థితి ఇక్కడివరకూ వచ్చుండేది కాదు. కానీ, తానేం తప్పు మాట్లాడలేదంటూ.. అన్న మాటకే కట్టుబడి ఉండటం అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. రెండేళ్ల జైలు.. ఎంపీగా అనర్హత వేటుతో.. రాహుల్‌కు రాజకీయ సమాధి రెడీ చేసింది బీజేపీ.

కాంగ్రెస్ అవినీతి పార్టీ. బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి 4G వేలం వరకూ.. కాంగ్రెస్ అంటేనే బ్రస్టాచార్ పార్టీ అంటూ బాగా బద్నామ్ చేశారు మోదీ. అనేక ప్రసంగాల్లో కాంగ్రెస్‌ పాలనపై అవినీతి ఆరోపణలు చేశారు. మరి, ఆనాటి కరెప్షన్‌పై ఒక్క కేసు అయినా పెట్టారా? అంటే లేదు. అంటే, మోదీ ఆరోపించినట్టు కాంగ్రెస్ హయాంలో అవినీతి జరగలేదా? జరిగిఉంటే కేసులు ఎందుకు పెట్టలేదు? అనేది ప్రశ్న. ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసును మాత్రమే తవ్వి బయటకు తీశారు. గాంధీ కుటుంబాన్ని పర్సనల్‌గా టార్గెట్ చేశారు. ఆ కేసులో ఉచ్చు బిగించగా.. ఈలోపే పరువునష్టం కేసులో రాహుల్‌ను లాక్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది కమలంపార్టీ.


చెట్టును పడగొట్టాలంటే.. కొమ్మలన్నీ కొట్టుకుంటూ రావాల్సిన పనిలేదు. మొదలు నరికేస్తే.. చెట్టు దానంతట అదే కుప్పకూలిపోతుంది. సేమ్ స్ట్రాటజీని కమలనాథులు అప్లై చేస్తున్నారు. బీజేపీ తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాలంటే.. గాంధీ కుటుంబంపై వేటు వేస్తే సరిపోతుంది.. కాంగ్రెస్ దిక్కులేని పార్టీగా మారుతుందనేది కాషాయ వ్యూహం. అధికారంలో లేకపోయినా.. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేడర్ పటిష్టంగా ఉంది. బలమైన లీడర్లకూ కొదవేమీ లేదు. కాలం కలిసిరావాలే కానీ.. చేతి రాతలు అమాంతం మారిపోతాయనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇదే కమలనాథులను కలవరపెట్టే అంశం. అందుకే, కాంగ్రెస్‌ను ఖతం చేయాలంటే.. నేరుగా గాంధీలకే గురిపెట్టాలని బీజేపీ డిసైడ్ అయింది.

సోనియా గాంధీ దాదాపు రిటైర్మెంట్ తీసుకున్నట్టే. ప్రియాంక యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు. మిగిలింది రాహుల్ ఒక్కరే. మొదట్లో అమూల్ బేబీ అన్నారు. భారత్ జోడో యాత్రతో అసలుసిసలు గాంధీ అయ్యారు. బీజేపీకి భయం పుట్టుకున్న టైమ్‌లో.. పరువునష్టం కేసులో శిక్ష పడి.. ఎంచక్కా చిక్కుకుపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఎంపీ పదవిపై వేటు వేసింది బీజేపీ. కాంగ్రెస్‌కు పూడ్చలేని డ్యామేజ్ చేసింది.

అయితే, ఫినిక్స్ పక్షిలా.. విపక్షాలన్నిటినీ కలుపుకుంటూ కాంగ్రెస్ మరో ప్రజాస్వామ్య భారత పోరాటం చేపట్టింది. రాహుల్‌గాంధీపై అనర్హతకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. కమలంపార్టీపై కదనోత్సాహంతో కలబడాలని డిసైడ్ అయ్యాయి. మరి, పవర్‌తో పని లేకుండా.. రాహుల్ ప్రజాక్షేత్రంలో పొలిటికల్ యోధుడిగా నెగ్గుకొస్తారా? కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టి.. సోనియాగాంధీలా పాలిస్తారా?

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×