BigTV English

Ram Charan: పొలిటికల్ ‘గేమ్‌ ఛేంజర్‌’.. స్టోరీ ఇదేనా?

Ram Charan: పొలిటికల్ ‘గేమ్‌ ఛేంజర్‌’.. స్టోరీ ఇదేనా?
Ram-Charan-Game-Changer

Ram Charan: రామ్ చరణ్, శంకర్. ఈ కాంబినేషనే బ్లాక్ బస్టర్. ఇక సినిమా అంతకుమించే. చరణ్ బర్త్‌డే సందర్భంగా RC15 కి ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది గేమ్ ఛేంజర్.


ఫస్ట్ గ్లింప్స్‌తోనే మూవీ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు డైరెక్టర్. చదరంగం థీమ్‌ను ఆసక్తిగా చూపించారు. అసెంబ్లీ సెట్టింగ్.. ఎమ్మెల్యేల సిట్టింగ్.. పోలింగ్ సింబల్.. పొలిటికల్ ‘కింగ్’.. ఆ రాజుకు చెక్ పెట్టేందుకు ట్రై చేసే పొలిటిషియన్స్.. వారందరినీ తలదన్నే రారాజు.. ఇలా చదరంగంలో పావులు కదుపుతూ.. ఇది రాజకీయ గేమ్ ఛేంజర్ అని చెప్పకనే చెప్పేసింది మూవీ టీమ్.

స్ట్రాంగ్ కథాంశాన్ని.. పవర్ ఫుల్‌గా చూపించడంలో డైరెక్టర్ శంకర్ ఎక్స్‌పర్ట్. గతంలో ఆయన పలు సినిమాల్లో రాజకీయ లోపాలను టచ్ చేశారు. రజినీకాంత్ ‘శివాజీ’లో విలన్ సుమన్ రాజకీయ నాయకుడే. అర్జున్ హీరోగా తీసిన ‘ఒకేఒక్కడు’ అప్పట్లో సంచలనం. ఒక్క రోజు సీఎంగా అర్జున్.. మొత్తం ప్రభుత్వ వ్యవస్థను రఫ్ఫాడించే విధానం అదుర్స్. ఇప్పుడు రామ్ చరణ్‌తో అలాంటి మెగా పవర్ ప్యాక్ మూవీనే తీస్తున్నారని గేమ్ ఛేంజర్‌తో తేలిపోతోందని అంటున్నారు.


రామ్ చరణ్‌కు పొలిటికల్ లైన్ సినిమాను చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది. గతంలో హీరో విజయ్ దేవరకొండ ‘నోటా’తో పొలిటికల్ రోల్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. అది పక్కా తమిళ వాసనలు ఉన్న సినిమా. కథ, కథనంలో బలం లేకపోవడం బిగ్ మైనస్. కానీ, దర్శకుడు శంకర్ అలా కాదు. కథ, కథనమే ఆయన బలం. హీరోను ఓ రేంజ్‌లో చూపిస్తారు. సినిమాను ఓ స్థాయిలో తీస్తారు. అలాంటి శంకర్‌తో.. RRRతో ఫుల్ ఫైర్ మీదున్న రామ్ చరణ్ జత కలవడం.. వారిద్దరి కాంబినేషన్లో పొలిటికల్ స్టోరీతో సినిమా వస్తుండటం.. ఇండస్ట్రీ ‘గేమ్ ఛేంజర్’ అంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×