Big Stories

iPhone:-మూడ్‌ను మెరుగుపరిచే ఐఫోన్ 14 ప్లస్..

iPhone:- కలర్స్‌తో కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని ఇప్పటికే ఎన్నో స్టడీలు తెలిపాయి. అందుకే ఎప్పుడూ ప్రశాంతమైన కలర్స్‌తోనే సావాసం చేయాలని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి కలర్స్‌లో ఒకటి యెల్లో. కొంతమంది ఈ కలర్‌ను కొత్త సీజన్‌కు చిహ్నంగా గుర్తిస్తారు. మరికొందరు ఇందులో గెలుపు, స్వచ్ఛత లాంటి భావాలు ఉంటాయంటారు. అందుకేనేమో ప్రముఖ ఫోన్ల బ్రాండ్ కూడా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఈ కలర్‌నే సెలక్ట్ చేసుకుంది.

- Advertisement -

ప్రస్తుతం అన్ని కలర్స్‌లో యెల్లోకే ఎక్కువగా పాపులారిటీ ఉందని సర్వే చెప్తోంది. అంతే కాకుండా ఈ కలర్‌తో కొందరికి ప్రత్యేకమైన బాండింగ్ ఉందంటోంది. యాపిల్ ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంది. అందుకే ఐఫోన్ 14, 14 ప్లస్ ఫోన్లను యెల్లో కలర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఐఫోన్ లుక్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఐఫోన్ 14 ప్లస్‌ సెరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్‌తో పాటు రిపేర్లకు సౌకర్యంగా ఉండేలా ఇంటర్నల్ డిజైన్‌లో మార్పులు, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

ఐఫోన్ 14 ప్లస్ పొడవు 6.7 అంగుళాలు. ఇప్పటివరకు యాపిల్ విడుదల చేసిన అన్ని ఫోన్లలో దీని బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం వస్తుందని కంపెనీ చెప్తోంది. ఇతర ఐఫోన్లలాగానే ఇందులో కూడా డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఏ15 బయోనిక్ చిప్ ఉంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ కూడా ఉంది. వీటితో పాటు సేఫ్టీ విషయంలో ఐఫోన్ 14 ప్లస్ ఎన్నో విధాలుగా మెరుగ్గా తయారు చేయబడింది.

ఐఫోన్ 14 ప్లస్ కవర్ యెల్లో ఫినిష్‌తో పాటు అల్యూమినియం డిజైన్‌తో చేయబడింది. ఇది వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్ ఫోన్‌కు లేని ఒక సెరామిక్ షీల్డ్ కవర్‌తో ఐఫోన్ 14 ప్లస్ తయారయ్యింది. ఇది పొరపాటున ఫోన్ కిందపడిన క్రాక్స్ రాకుండా కాపాడుతుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. ఓఎల్ఈడీ టెక్నాలజీతో కూడినా సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుంది. ఇది 1200 నిట్స్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెత్‌తో పాటు డాల్బీ విజన్‌ను కూడా సపోర్ట్ చేసేలా ఉంటుంది. దీంతో కస్టమర్లు తమకు నచ్చిన సినిమాలను, షోలను క్వాలిటీతో చూడవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ యెల్లోతో పాటు మరో 5 కలర్లలో తయారు కానుంది. ప్రస్తుతం యెల్లో కలర్ ఒకటి అంతటా అందుబాటులోకి వచ్చింది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 14 ప్లస్ తయారయ్యింది. దీని ప్రైజ్ రూ.89,900 నుండి మొదలుకానుంది. అయితే కేవలం లుక్స్ విషయంలోనే కాదు.. మూడ్‌ను మెరుగుపరచడానికి కూడా ఐఫోన్ 14 ప్లస్ ఉపయోగపడుతుందని పలువురు నిపుణులు చెప్తున్నారు. యెల్లో ఒక అలనాటి కలర్ అని, ఇది చాలామందికి నచ్చేలా ఉంటుందన్నారు.

భూమిపై గ్రహంతరవాసుల ఆధారాలు.. నిజమేనా..?

for more updates follow this link:-bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News