BigTV English

Bjp On Gaddar: గద్దర్‌పై బీజేపీ మాటల దాడి, ఈసారి ఎల్టీటీఈతో పోలిక

Bjp On Gaddar: గద్దర్‌పై బీజేపీ మాటల దాడి, ఈసారి ఎల్టీటీఈతో పోలిక

Bjp On Gaddar: తెలంగాణలో రాజకీయాలు గద్దర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈయన్ని ఏ మాత్రం బీజేపీ నేతలు వదల్లేదు. రోజుకొక నేత ఆయనపై ఎదురుదాడి చేస్తూనే వున్నారు. తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆ జాబితాలోకి చేరిపోయారు. ఓ అడుగు ముందుకేసిన ఆయన, గద్దర్‌ను ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌తో పోల్చడం అగ్ని ఆజ్ఞం పోసినట్లయ్యింది.


రిప్లబిక్ డే సందర్భంగా కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డుల్లో పురష్కారాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓపెన్‌గా చెప్పారు. పొరుగు రాష్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చిన కేంద్రం, తెలంగాణలో ఇద్దరితో సరిపెట్టుకుంద న్నారు.  ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో తెలంగాణ ప్రభుత్వం పంపిన జాబితాను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ రాసిన, పాడిన గద్దర్ పాట. ఇది తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది కూడా. సీన్ కట్ చేస్తే.. గద్దరపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి. ఆయనను LTTE ప్రభాకరన్‌, నయీమ్‌లతో పోల్చారు.


రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్‌.. మావోయిస్టులకు చెందిన నాయకుడు, ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా? రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టే ప్రయత్నం చేశారాయన.

ALSO READ: తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఇదే.. ఇది మామూలు వ్యుహం కాదు..!!

అంతకుముందు సోమవారం పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అదే స్థాయిలో స్పందించారు. బరాబర్ ఆయనకు అవార్డు ఇచ్చే ప్రశ్న లేదన్నారు. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గద్దర్‌ను ఆ విధంగా ప్రశ్నించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×