BigTV English

BRS Kavitha: సేఫ్ జోన్ కోసం కవిత వెతుకులాట

BRS Kavitha: సేఫ్ జోన్ కోసం కవిత వెతుకులాట

BRS Kavitha: వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా? నియోజకవర్గాల ఎంపికలో పెద్దాయన నిమగ్నమయ్యారా? పార్టీని నమ్ముకున్న నేతలకు ఇప్పటికే నియోజకవర్గాలు కేటాయించే పనిలో పడ్డారా? ఈసారి లోక్‌సభకు బదులు అసెంబ్లీ నుంచి కవిత బరిలోకి దిగుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ముందస్తు ఎన్నికలు సూచనతో బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు-2014 ప్రకారం.. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇంతకీ సీట్లు ఈసారి ఎక్కడ పెరుగుతున్నాయి? జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్నాయా? లేక మిగతా నియోజకవర్గాల్లో పెరుగుతున్నాయా? ఇదే చర్చ బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది.

సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన మంత్రులు ఈసారి తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయని మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు. ఏయే ప్రాంతాల్లో సీట్లు పెరుగుతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీట్లు పెరుగుతున్నట్లు ఓ అంచనా.


ఎందుకంటే తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ నగరానికి తరలివస్తున్నారు. దీంతో సిటీ జనాభా పెరుగుతోంది. దీనికితోడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇక్కడే ఉండడంతో జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: తెలంగాణ సంక్రాంతి.. సరికొత్తగా ప్లాన్ చేసిన సర్కార్.. సంబరాలకు మీరు రెడీనా!

ఈ క్రమంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు ఎంపిక కేసీఆర్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరి కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ బరిలో దిగుతున్నారా? లేక అసెంబ్లీ నుంచి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారా? అన్న చర్చ బీఆర్ఎస్‌లో మొదలైపోయింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారట కవిత. అందుకు సంబంధించి తెర వెనుక చకచకా పనులు చేస్తూ వెళ్లిపోతున్నారు. జగిత్యాల నుంచి గతంలో గెలిచిన సంజయ్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.

జగిత్యాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు డాక్టర్ సంజయ్. ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావడం, గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారట కవిత. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగినా, జగిత్యాలలో మాత్రం కారు పట్టు నిలుపుకోవడం వెనుక కవిత ఉందని ఆ పార్టీ లోకల్ కేడర్ బలంగా నమ్ముతోంది.

సంజయ్ వెళ్లిన తర్వాత అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్ ఎవరినీ నిలబెట్టలేదు బీఆర్ఎస్. దీంతో కవిత ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు కేడర్ మాట. ఆ నియోజకవర్గంలో వరుసగా కార్యక్రమాలు చేపట్టడం ఇదే కారణమని అంటున్నారు.

రాజకీయాల్లో కవిత యాక్టివ్ అయిన తర్వాత ర్యాలీ, మీటింగ్ అక్కడే తొలుత పెట్టారు. నాటి తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడే శంకుస్థాపన చేశారామె. మండలిలో ఆ నియోజకవర్గం నుంచే ప్రధానంగా మాట్లాడుతున్నారట. మొత్తానికి అన్నీ పనులు అక్కడి నుంచే మొదలుపెడుతున్నారట కవిత.

Related News

Telangana Group-1 Exam: తెలంగాణ గ్రూప్-1 వివాదం.. ప్రశ్నలు లేవనెత్తిన హైకోర్టు, విచారణ వాయిదా

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Big Stories

×