BigTV English

Daren Sammy: విండీస్ ప్లేయర్ సామీకి కీలక పదవి !

Daren Sammy: విండీస్ ప్లేయర్ సామీకి కీలక పదవి !

Daren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి {Daren Sammy} ఇకనుండి వెస్టిండీస్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే వన్డే, టి-20 ఫార్మాట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న సామీకి.. వెస్టిండీస్ బోర్డు టెస్ట్ జట్టు కీలక బాధ్యతలు అప్పగించింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుండి టెస్ట్ క్రికెట్ కి కూడా కోచింగ్ బాధ్యతలను సామి {Daren Sammy} స్వీకరిస్తాడని క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ మైల్స్ పేర్కొన్నారు.


Also Read: Anil Kumble on Virat Kohli: కోహ్లీపై కుంబ్లే తీవ్ర విమర్శలు.. లండన్ లో సెటిల్ అయ్యే సమయం వచ్చిందంటూ..!

ప్రస్తుతం టెస్టుల్లో వెస్టిండీస్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న ఆండ్రీ కోలీ స్థానంలో డారిన్ సామీ {Daren Sammy} ఎంపిక అయ్యాడు. సామి సారథ్యంలో వెస్టిండీస్ జట్టు రెండుసార్లు t-20 వరల్డ్ కప్ నెగ్గింది. ఇక తనని పూర్తిస్థాయి కోచ్ గా నియమించడం పట్ల డారిన్ సామీ {Daren Sammy} సంతోషం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ కి ఏ హోదాలో ప్రతినిత్యం వహించినా అదీ తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని తెలిపాడు. తన సారథ్యంలో వెస్టిండీస్ జట్టుకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నాడు.


ఇక విండీస్ తరఫున 38 టెస్టులు ఆడిన సామి, 126 వన్డేలు, 68 t-20 మ్యాచ్ లు ఆడాడు. అలాగే అక్టోబర్ 2010 నుండి మే 2014 వరకు వెస్టిండీస్ టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా {Daren Sammy} బాధ్యతలు చేపట్టాడు సామి. తన సారధ్యంలో ఆడిన 30 టెస్టుల్లో 8 విజయాలు, 12 పరాజయాలు, 10 డ్రాలు నమోదు చేశాడు. 2004లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన సామి.. ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

అతని {Daren Sammy} సారధ్యంలో విండీస్ జట్టు రెండుసార్లు టి-20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఇక 2017 సెప్టెంబర్ లో చివరి టి-20 మ్యాచ్ ఆడాడు. అయితే ఆ సమయంలో వెండిస్ బోర్డుతో కొన్ని విభేదాల నేపద్యంలో చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. సామి తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు.

Also Read: IND vs AUS: మళ్లీ అదే తప్పు.. నీకు బ్యాటింగ్‌ చేతకాదంటూ కోహ్లీపై గవాస్కర్‌ సీరియస్

2020 అలాగే 2021 సంవత్సరాలలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుని ఫైనల్స్ కి తీసుకురవడంలో డారిన్ సామి {Daren Sammy} కీలకపాత్ర పోషించాడు. ఇక అతడు పాకిస్తాన్ క్రికెట్ కి చేసిన అద్భుతమైన సేవలకు గాను ” సితార – ఎ – పాకిస్తాన్” పౌర పురస్కారం కూడా అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ జట్టుకు సామి {Daren Sammy} హెడ్ కోచ్ గా పని చేశాడు. అతని సారథ్యంలో పెషావర్ అద్భుతంగా రాణించింది. అందుకుగాను పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డుతో అతడిని సత్కరించింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×