E-Paper
Advertisement

Kavitha : మరోసారి కవితకు అండగా గులాబీ బాస్?

Kavitha : మరోసారి కవితకు అండగా గులాబీ బాస్?
Advertisement

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, గులాబీ బాస్ కేసీఆర్ అండగా నిలవనున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా 23 మందికి ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి, మనీలాండరింగ్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టంచేసింది.అంతేకాకుండా నిజనిర్దారణ చేయకుండా స్టేట్మెంట్స్ మీద కేసులు ఎలా పెడతారని సీబీఐ మీద కోర్టు సీరియస్ అయ్యింది.

హైకోర్టులో సీబీఐ సవాల్..

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కింది కోర్టు వ్యాఖ్యలను ఈడీ సైతం తప్పుబట్టి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.ఇకపోతే నిందితులను అలా నిర్దోషులుగా ప్రకటించడం వలన సాక్ష్యాలను తారుమారు చేయగలరని, ఈ కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 16న ఢిల్లీ హైకోర్టులో హాజరుకావాలని సీబీఐ అధికారులు నిన్న సాయంత్రం కవిత ఇంటికి వెళ్లారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె భర్తకు నోటీసులు అందజేశారు.విషయం తెలుసుకున్న కవిత.. తన లీగల్ టీంను సంప్రదించాకే నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.

నోటీసులపై కేసీఆర్ ఆరా?

Advertisement

కవితకు మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సన్నిహితుల ద్వారా ఆరా తీసినట్టు తెలుస్తున్నది. కవితకు తెలియకుండానే ఈ కేసు విషయాలు, సీబీఐ హైకోర్టులో ఎలాంటి అంశాలను పిటిషన్‌లో చేర్చింది. మరోసారి అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అని ఢిల్లీ లెవల్‌లో సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గులాబీబాస్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ కవిత అరెస్టు జరిగితే ఎలా బయటకు తీసుకురావాలి,కేంద్రాన్ని ఎలా బద్నాం చేయాలి? నేరుగా కాకుండా పరోక్షంగా పని జరిగిపోవాలని కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

Iftar Controversy: హైదరాబాద్‌లో ఇఫ్తార్ విందు ఫ్లెక్సీల వివాదం.. చించి పారేసిన బీజేపి నాయకురాలు

కవిత వెళ్తారా?

Advertisement

కవిత ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టే యోచనలో బిజీగా ఉన్నారు. మే 4న కొత్త పార్టీ పెడతారని ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఆలోపు కవితను మరోసారి సీబీఐ విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటే ఎలా? అంతకుముందు నోటీసుల్లో పేర్కొన్న విధంగా ఆమె ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టుకు హాజరవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బిజీ షెడ్యూల్ దృష్ట్యా మరో రోజు ఇవ్వాలని హైకోర్టును గడువు కోరతారా? లేదా నేరుగా హాజరై సీబీఐ, కోర్టు ప్రశ్నలకు సమాధానం చెబుతారా? అనేది తెలియాల్సి ఉన్నది. ఇదిలాఉండగా, కవితను కాపాడేందుకు కేసీఆర్ గుట్టుగా వ్యవహారం నడుపుతున్నారని ఎవరికీ తెలియదని టాక్.కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరమైనా, రాజకీయాల్లో సొంత అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్నా.. ఎంతైనా తండ్రికి బిడ్డే కదా? ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×