BigTV English

BRS Party : ఓడిపోతామని ఫిక్స్ అయ్యారా? కేసీఆర్, కేటీఆర్ మాటల్లో ఓటమి భయాలు..!

BRS Party : ఓడిపోతామని ఫిక్స్ అయ్యారా? కేసీఆర్, కేటీఆర్ మాటల్లో ఓటమి భయాలు..!
BRS Party

BRS Party : అచ్చంపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ వ్యక్తిగతంగా మాకు పోయేదేం లేదు. కాపోతే మీరు ఓడగొట్టిన్రనుకో ఏమున్నది? రెస్ట్ తీసుకుంటాం.. మాకచ్చేదేమీ లేదు.. పోయేదేమీ లేదు..
ఇలా సాగిపోయింది ఆయన ప్రసంగం


మంత్రి కేటీఆర్ ఏం చెబుతున్నారంటే.. హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, వ్యాపార వర్గాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణిలో సమస్యలున్నమాట నిజమేనని అన్నారు. మీరు హాలిడే లో ఎంజాయ్ చేయాలనుకుంటే, మాకు హాలిడే ఇవ్వకండి అని కోరారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉందనే రిపోర్ట్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పీకే రిపోర్ట్ అంటూ ఒకటి నెట్టింట బాగానే హల్ చల్ చేస్తోంది.


అంతేకాదు ఎప్పుడూ లేనిది ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. అంటే ప్రజల్లో చైతన్యం వస్తోందని చెప్పడానికి తెలంగాణ ఎన్నికలే ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఎంత తీవ్ర నిరాశ నిసృహలు ఉంటే వారిలా హద్దులు దాటి ప్రవర్తిస్తారని అంటున్నారు.

ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. కొందరినైతే గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ఎమ్మెల్యేలు ఏమన్నా అంటే.. ఏం చేస్తారంటూ ఎదురు తిరుగుతున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా తిడుతున్నారు. అవమానిస్తున్నారు. చెప్పు తీసుకుని కొడతామని కూడా అంటున్నారు.  ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడానికి భయపడుతున్నట్టు సమాచారం. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు. సంపాదించుకున్నది చాలు, ఇక సర్దుకుందాం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కూడా దండగే అని మెంటల్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు.. రాజకీయ నాయకులు ఊళ్లల్లోకి వస్తున్నారంటే వాళ్ల ప్రసంగాలు వినడానికి వచ్చేవారు. అంతా అయిపోయాక.. ఎవడొచ్చినా అంతే, ఎవడూ చేసేది ఉండదు, పెట్టేది ఉండదు, ఎన్ని చూడలేదు అనుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారు. ఇది బీఆర్ఎస్ కి ప్రతికూలంగా మారేలా ఉంది.

అటు కేసీఆర్, కేటీఆర్ నిరాశ నిస్పృహలు, ఇటు పీకే రిపోర్ట్,  మరోవైపు ప్రజల మాట…ఇవన్నీ చూసేసరికి బీఆర్ఎస్ సిన్మా టాక్ బయటకు వచ్చేసిందని అంటున్నారు. ఇంక ఇప్పుడు ఎన్ని సీట్లకు బీఆర్ఎస్ పరిమితం అవుతుందనే దానిపైనే వాదనలు బయటకు వస్తున్నాయి. పందాలు మొదలవుతున్నాయి.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×