BigTV English

Kushboo : జబర్దస్త్ జడ్జిపై అట్రాసిటీ కేసు.. కారణమిదేనా..?

Kushboo : జబర్దస్త్ జడ్జిపై అట్రాసిటీ కేసు.. కారణమిదేనా..?

Kushboo : సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది ఎక్కడ ఏ మూల ఏం జరిగినా క్షణాల మీద వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు పాజిటివ్ ఇమేజ్ తెచ్చి పెడుతుంటే ..మరికొన్ని కాంట్రవర్సీల కిందకు తిరిగి వాళ్లకే ముప్పు తెస్తున్నాయి. సీనియర్ నటి కుష్బూ ప్రస్తుతం ఇదే పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం సృష్టించాయి.


చాలామంది నటీనటులు సినీ ఇండస్ట్రీలో తమకున్న ఇమేజ్ ని ఉపయోగించుకొని రాజకీయాల్లో కూడా బాగా రాణించారు. అలా సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం రాజకీయంగా కూడా ముందుకు వెళ్తున్న హీరోయిన్ ఖుష్బూ. అప్పట్లో ఖుష్బూ ఎందరో స్టార్ హీరోల సరసన మంచి చిత్రాల్లో నటించి తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టిన కుష్బూ టాలీవుడ్ లోనే తొలి సక్సెస్ అందుకుంది. విక్టరీ వెంకటేష్ , కుష్బూ కాంబోలో వచ్చిన కలియుగ పాండవులు మూవీ మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.

కెరియర్ పిక్స్ లో ఉన్న దశ లో అన్ని భాషల చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ.. గత కొద్ది కాలంగా రాజకీయాలలో కూడా రాణిస్తోంది. ప్రస్తుతం తిరిగి అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంది.జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్న కుష్బూ పై తాజాగా అట్రాసిటీ కేసు నమోదు చేయవలసిందిగా ఫిర్యాదు రావడం హాట్ డిస్కషన్ గా మారింది.


మన్సూర్ అలీఖాన్.. త్రిష పై చేసిన వ్యాఖ్యలకు కుష్బూ స్పందించడంతో అసలు కథ మొదలైంది. మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్పందించిన ఖుష్బూ.. ట్విట్టర్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నీలాగా లోకల్ భాషలో నేను మాట్లాడలేను అని అంది. ఈ నేపథ్యంలో దళితులు మాట్లాడే భాషను ఖుష్బూ కించపరిచిందని.. కొన్ని దళిత వర్గాలు ఆమెపై అట్రాసిటీ చట్టం కింద చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎస్సీలను కించపరిచే విధంగా 

ఖుష్బు చేసిన ట్వీట్ ఉంది అంటూ తమిళ కాంగ్రెస్ కమిటీ ఎస్సి విభాగం ఆమెపై భగ్గుమంది. వెంటనే ఆమె పెట్టిన పోస్ట్ ను తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఆమె ఇంటి ముందు ఆందోళన చేపడుతామని వారు తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×