E-Paper
Advertisement

Kakinada Hope Island: కాకినాడ మరో శ్రీహరికోట.. హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!

Kakinada Hope Island: కాకినాడ మరో శ్రీహరికోట.. హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!
Advertisement

Kakinada Hope Island: కాకినాడ రానున్నరోజల్లో శాటిలైట్ల ప్రయోగానికి కేంద్రంగా మారబోతోందా? ప్రస్తుతం ఇప్పుడున్న శ్రీహరికోటపై రద్దీ పెరుగుతోందా? అందుకే మరో శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందా? అదే జరిగితే కాకినాడ అందుకు కేరాఫ్‌గా మారనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాకినాడ మరో శ్రీహరికోట

Advertisement

ఈ మధ్యకాలంలో డిఫెన్స్- స్పేస్ టెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు తెరుస్తోంది కేంద్ర ప్రభుత్వం.  చాలా విదేశీ కంపెనీలు అటువైపు ఫోకస్ చేశాయి. భారత అంతరిక్ష కేంద్రం-ఇస్రో వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నంలో పడింది. ఇందులో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెంచేందుకు విధానాలు రెడీ చేస్తోంది. ఇస్రో తన వ్యాపారాన్ని పెంచుకునే పనిలో పడింది.

ప్రస్తుతం 8 బిలియన్ల డాలర్ల నుండి 2040 నాటికి 100 బిలియన్లకు వ్యాపారాన్ని పెంచాలని భావిస్తోంది. ఆ విధంగా అడుగులు వేస్తోంది. ఈ విభాగంలో 100 శాతం FDI కూడా అనుమతించబడింది. స్టార్టప్‌లు, శాటిలైట్లు లాంచ్ చేయడం, మిషన్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది.

Advertisement

హోప్ ఐలాండ్‌లో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం!

దేశంలో శాటిలైట్ల ప్రయోగానికి శ్రీహరికోట ప్రధాన కేంద్రం. ఆ ప్రాంతం నుంచి వందకు పైగానే శాటిలైట్లను ప్రయోగించింది. ఇక్కడ నుంచి కక్షలోకి పెట్టడం ఈజీ అవుతుందని ఇస్రో భావిస్తోంది. శ్రీహరికోటకు ధీటుగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలని భావిస్తోంది.

ఈ క్రమంలో కాకినాడలో హోప్ ఐలాండ్ పేరు బలంగా వినిపిస్తోంది. శనివారం కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని స్పేస్ సిటీ నుంచి ఉపగ్రహాలను ప్రయోగించగలమని వ్యాఖ్యానించారు. త్వరలో కాకినాడ హోప్ ఐలాండ్ నుంచి శాటిలైట్లు పంపుతామని, ఈ రంగంలో అనిల్ ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యనించారు.

ALSO READ: జియో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్.. డైలీ డేటా, 84 రోజుల వాలిడిటీ కేవలం రూ. 369 మాత్రమే

ప్రస్తుతం పారిశ్రామిక ఓడరేవు కేంద్రంగా ఉంది కాకినాడ. రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయోగాలకు ముఖద్వారంగా మారనుంది. శ్రీహరికోటతో పాటు ప్రపంచంలోని ఉన్నత అంతరిక్ష పటంలో చేరడానికి కాకినాడ సిద్ధమవుతోందన్నమాట. అంతా అనుకున్నట్లు జరిగితే భారత అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మరో అడుగుకు పడనుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×