BigTV English

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..

BRS Loosing Municipalities : నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే.. ఖానాఫూర్ లో నెగ్గిన అవిశ్వాసం..
BRS Loosing Municipalities

BRS Loosing Municipalities(Breaking news in telangana): నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌కు దక్కింది. 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో చైర్మన్ ఎన్నిక జరిగింది. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న BRS మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయింది BRS. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.


అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ పార్టీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కోల్పోతోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఈ మున్సిపాలిటి కాంగ్రెస్‌ వశమైంది. పార్టీలకు అతీతంగా హస్తం పార్టీ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో బీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపాలిటీ చేజారి.. కాంగ్రెస్‌ ఖాతాలో పడింది.


Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×