BigTV English

Medchal Robbery Case: పట్టపగలే బుర్ఖాల్లో వచ్చి నగల షాపులో చోరి.. యజమానిపై కత్తులతో దాడి

Medchal Robbery Case: పట్టపగలే బుర్ఖాల్లో వచ్చి నగల షాపులో చోరి.. యజమానిపై కత్తులతో దాడి

Medchal Robbery Case: హైదరాబాద్ నగరంలో దొంగల ముఠా రెచ్చిపోతుంది. మహానగరంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మేడ్చల్‌లో పట్టపగలే ఓ దొంగల ముఠా భారీ దొంగతనానికి ప్రయత్నించింది. మహిళల మాదిరిగానే దొంగల వేషంలో వచ్చి దొంగతనం చేసేందుకు ఇద్దరు దొంగలు ప్రయత్నించారు. బుర్ఖా ధరించి ఒక వ్యక్తి, బ్యాగు వేసుకుని మరొక వ్యక్తి షాపు ఎదుటకు వచ్చి బండిని పెట్టారు. అనంతరం షాపులోకి దూరారు.


ఈ తరుణంలో వారితో పాటు కత్తిని కూడా తీసుకుని వచ్చారు. ఒక్కసారిగా షాపులోకి ఎంటర్ అయి యజమానిని, సిబ్బందని భయబ్రాంతులకు గురిచేశారు. యజమానిపై కత్తితో దాడి చేసి ఓ బ్యాగులో నగలన్నీ నింపాలని డిమాండ్ చేశారు. దీంతో యజమాని చాకచక్యంగా వ్యవహరించి వెంటనే దొంగల బారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. ఈ తరుణంలో వెంటనే వారిని పక్కకు నెట్టేసి షాపు బయటకు పరుగులు తీశాడు.

దొంగలు యజమాని బయటకు వెళ్లడంతో అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో షాపులోకి ఓ వ్యక్తి కుర్చీని తీసుకుని వచ్చి దొంగలపై విసిరాడు. ఓవైపు రక్తం కారుతున్నా కూడా యజమాని దొంగలను వెంబడించేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంటనే షాపు యజమానిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×