E-Paper
Advertisement

Jangaon Car Accident: కారుతో సహా నీటి అడుగున విగతజీవిగా పవన్.. జనగామ జిల్లాలో విషాద ఛాయలు

Jangaon Car Accident: కారుతో సహా నీటి అడుగున విగతజీవిగా పవన్.. జనగామ జిల్లాలో విషాద ఛాయలు
Advertisement

Jangaon Car Accident: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో చోటుచేసుకున్న కారు ప్రమాద ఘటన విషాదాంతమైంది. గల్లంతైన యువకుడు పవన్ మృతదేహం గురువారం సాయంత్రం రిజర్వాయర్ నీటిలో లభ్యమైంది. ఘన్‌పూర్ నుండి దేశాయి తండాకు వెళ్తుండగా అదుపుతప్పి కారు రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు ఉండగా.. ధారావత్ చరణ్ (18) అనే యువకుడు ప్రాణాలతో బయటపడగా పవన్ మాత్రం కారుతో సహా నీటిలో మునిగిపోయాడు.

ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్‌లో నీటి మట్టం ఎక్కువగా ఉండటం.. కారు లోతుకు వెళ్లిపోవడంతో గాలింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. సుమారు 24 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించిన గజ ఈతగాళ్లు.. ఎట్టకేలకు నీటి అడుగున ఉన్న కారును గుర్తించారు. కారు లోపలే పవన్ మృతదేహం ఇరుక్కుపోయి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ వార్త తెలియగానే పవన్ కుటుంబ సభ్యులు.. దేశాయి తండా గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అతి వేగం లేదా రహదారి మలుపు వద్ద అదుపు తప్పడం వల్లే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×