E-Paper
Advertisement

Cash for Vote : డబ్బులివ్వకపోతే ఓటు వేసేది లేదు.. ఖాళీగా పోలింగ్ కేంద్రాలు!

Cash for Vote : ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు ఆశచూపితే ఓటర్లంతా తమకే ఓటు వేస్తారని అన్ని రాజకీయ పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా ఓటుకు నోటు అనే సూత్రాన్ని పాఠిస్తున్నాయి. ఇది అవినీతి అయినా.. చట్ట విరుద్ధమైనా.. అందరూ చేస్తున్న పనే. కానీ రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఇంకా ముదిరిపోయారు. ఎన్నికలు వస్తే మంచి ప్రభుత్వం ఏర్పడాలి అనే ఆలోచించేవారికన్నా.. ఓటుకు డబ్బులు వస్తాయి అని ఆలోచించేవారు ఎక్కువైపోతున్నారు. అంటే ప్రజల్లో కూడా అవినీతి పెరిగిపోతోంది.

Cash for Vote : డబ్బులివ్వకపోతే ఓటు వేసేది లేదు.. ఖాళీగా పోలింగ్ కేంద్రాలు!
Advertisement

Cash for Vote : ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు ఆశచూపితే ఓటర్లంతా తమకే ఓటు వేస్తారని అన్ని రాజకీయ పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా ఓటుకు నోటు అనే సూత్రాన్ని పాఠిస్తున్నాయి. ఇది అవినీతి అయినా.. చట్ట విరుద్ధమైనా.. అందరూ చేస్తున్న పనే. కానీ రాజకీయ పార్టీల కంటే ఓటర్లు ఇంకా ముదిరిపోయారు. ఎన్నికలు వస్తే మంచి ప్రభుత్వం ఏర్పడాలి అనే ఆలోచించేవారికన్నా.. ఓటుకు డబ్బులు వస్తాయి అని ఆలోచించేవారు ఎక్కువైపోతున్నారు. అంటే ప్రజల్లో కూడా అవినీతి పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో కొందరు ఓటర్లు తమ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని.. ఓటు వేయడానికి రావడం లేదు. ఫలితంగా పోలింగ్ కేంద్రాలు మూగపోతున్నాయి. తాజాగా ఈ పరిస్థితి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనిపిస్తోంది. 24 డివిజన్లున్న ఈ నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 9 గంటల వరకు 5 శాతం పోలింగ్ నమోదైంది. అదే 11 గంటల వరకు 11.5 శాతం మత్రమే పోలింగ్ జరిగింది.

Advertisement

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు తమకు డబ్బులు అందలేదని కొందరు స్థానిక నేతలతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఉన్న 24 డివిజన్‌‌లలో 10 డివిజన్‌లలో మాత్రమే బిఆర్ఎస్ తరపున నగదు పంపిణీ జరిగిందని స్థానికంగా చెప్పుకుంటున్నారు.

మిగతా 14 డివిజన్లలో డబ్బులు అందకపోవడంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుముఖంగా లేరని అర్థమవుతోంది. అందుకే ఈ 14 డివిజన్లలో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పోలింగ్ సమయం సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఈ లోగా వారు వినియోగించుకునే అవకాశం ఉంది.

Advertisement

ఇలాంటి పరిస్థితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో కనిపించింది. నియోజకవర్గంలోని కొన్ని మున్సిపల్ వార్డుల్లో ఓటర్లు ఇంటి నుంచి బయటికి రావడం లేదు. ఒక ఓటుకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఒక అభ్యర్థి పంపిణీ చేశారని చెబుతున్నారు. అయితే అక్కడ కొంతమందికి మాత్రమే డబ్బులు అందాయని .. అందరికీ అందలేదని.. మధ్యవర్తులు కాజేరని ఆరోపిస్తున్నారు. అందుకే తాము ఓటు వేసేది లేదని కొత్తగూడెం ఓటర్లు భీష్మించుకు కూర్చున్నారు. పోటీ చేసే అభ్యర్థులు చేతికి చిక్కితే.. వారికి దేహశుద్ధి చేస్తామని కూడా చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో అయితే మహిళలు రోడ్డుపై నిరసన చేశారు. ఖాళీ సీసాలు పగలగొట్టారు. రోడ్డుపై రాకపోకలను అడ్డుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ తమ ప్రాంతంలో డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు.

ప్రజలు ఓటు వేయడం అనేది తమ హక్కు, అధికారం అని భావించడం సబబే.. కానీ అది కచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత అని కూడా తెలుసుకోవాలి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×