Big Stories

MLC Kavitha: విచారణకు రండి.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు..

CBI Summons to MLC Kavitha on Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC ) కల్వకుంట్ల కవితకు సీబీఐ సమాన్లు జారీ చేసింది.

- Advertisement -

2024 ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు ఈడీ దర్యాప్తు సంస్థ కవితకు నోటీసులు పంపింది. కానీ ఆమె హాజరు కాలేదు. మరి ఈ సారి సీబీఐ విచారణకైనా హాజరు అవుతారో లేదో వేచి చూడాలి.

- Advertisement -

మరోవైపు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ BRS MLC కవిత వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేకంగా విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News